ఫోటో స్టోరి: బికినీలో ర‌ఫ్ఫాడిస్తున్న ర‌స‌గుళిక‌

Update: 2021-10-05 23:30 GMT
ప్ర‌ముఖ న‌టి పూజా భేడీ న‌ట‌వార‌సురాలిగా ఈ బాలీవుడ్ భామ సుప‌రిచితం. నేటిత‌రం న‌ట‌వార‌సురాళ్ల‌తో పోటీప‌డుతున్న‌ ఆల‌య సామాజిక మాధ్య‌మాల్లో గొప్ప‌గా హొయ‌లు పోయే భామ‌లు ఆ ఫోటోషూట్ల కోసం ఎంత‌గా త‌పిస్తారో ప‌ర్ఫెక్ష‌న్ రాకపోతే ఎన్ని పాట్లు ప‌డ‌తారో కూడా త‌న‌దైన శైలిలో వెల్ల‌డించింది. అంతా క‌ల్పితం!! అంటూ సామాజిక మాధ్య‌మాల ద్వారా బోలెడంత వినోదం పంచుతోంది.

న‌వ‌త‌రం నాయిక‌ల్లో ప్ర‌తిభావ‌నిగా గుర్తింపు తెచ్చుకున్న ఆల‌య వ‌రుస సినిమాల‌తో బిజీగా ఉంది. మ‌రోవైపు సోష‌ల్ మీడియాల్లోనూ ఈ బ్యూటీ ర‌ఫ్ఫాడిస్తోంది. ``ఈ షాట్ రాకముందే ఎన్ని స్క్రాప్డ్ షాట్స్ ఎదుర్కొన్నానో.. మోకాలు నొప్పి పెట్టేలా విఫల ప్రయత్నాలు చేశానో మీకు చెప్పాలనుకుంటున్నాను`` అని ఆల‌య‌ పరిపూర్ణతను తీసుకురావడానికి తాను చాలా రీటేక్ లు చేసే అల‌వాటుంద‌ని తెలిపింది. తాజాగా వ‌రుస బికినీ ఫోటోల‌తో హీట్ పెంచిన ఆల‌య వాటి కోసం ఎంతో శ్ర‌మించాల్సొచ్చింద‌ని తెలిపింది.

నిజానికి సోష‌ల్ మీడియాలో ప్ర‌తిదీ చూపించ‌లేం. ఈ వేదిక‌పై గొప్ప ఎలివేష‌న్ ఉండేవే షేర్ చేస్తామ‌ని.. జీవితంలోని అన్ని వికారాలను దాచిపెడతామని తెలిపింది. ఈ బికినీ షూట్ ల‌క్షలాది వ్యూస్ తో దూసుకెళుతోంది. ఆల‌య ఇంత‌కుముందు షేర్ చేసిన ఫ‌న్నీ వీడియోలు ఫోటోలు అంత‌ర్జాలంలో జోరుగానే వైర‌ల్ అయ్యాయి. బికినీలు టూపీస్ లు మాత్ర‌మే కాదు.. క్లాసిక‌ల్ డ్రెస్ ల‌తోనూ ఆలయ మెరిపిస్తుంటుంది. జ‌వానీ జానేమాన్ లో న‌టించింది. దీంతో పాటు ప‌లు క్రేజీ చిత్రాల్లో ఆల‌య న‌టిస్తోంది.




Tags:    

Similar News