• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  అతి పెద్ద స్క్రీన్‌ పై...

అతి పెద్ద స్క్రీన్‌ పై అలవైకుంఠపురంలో..!

By - Tupaki Desk
Update: 2019-12-11 07:26 GMT
అల్లు అర్జున్‌.. త్రివిక్రమ్‌ ల కాంబినేషన్‌ లో రూపొందిన 'అల వైకుంఠపురంలో' సినిమా సంక్రాంతి కి ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే. భారీ అంచనాల నడుమ రూపొందుతున్న ఈ చిత్రంతో వీరిద్దరు హ్యాట్రిక్‌ కొట్టడం ఖాయం అంటూ మెగా ఫ్యాన్స్‌ చాలా నమ్మకంగా ఉన్నారు. జులాయి మరియు సన్నాఫ్‌ సత్యమూర్తిలను మించి ఈ చిత్రం ఉంటుందనే నమ్మకంను మెగా ఫ్యాన్స్‌ వ్యక్తం చేస్తున్నారు. బన్నీ కి కూడా ఈ సినిమా సక్సెస్‌ చాలా అవసరం. అందుకే ఈ సినిమా పబ్లిసిటీ కోసం చాలా ప్రత్యేకం గా పబ్లిసిటీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

ఓవర్సీస్‌ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించే ఉద్దేశ్యంతో ఈ చిత్రంను ప్రపంచంలోనే అతి పెద్ద స్క్రీన్‌ గా రికార్డు దక్కించుకున్న ఐమాక్స్‌ మెల్‌ బోర్న్‌ స్క్రీన్‌ లో ప్రదర్శించేందుకు సిద్దం అయ్యారట. జనవరి 12 ఉదయం 7.30 గంటలకు ఈ చిత్రంను అతిపెద్ద ఐమాక్స్‌ స్క్రీన్‌ పై ప్రదర్శించబోతున్నట్లుగా సమాచారం అందుతోంది. తెలుగు భాషలోనే ఇంగ్లీష్‌ సబ్‌ టైటిల్స్‌ తో ఈ సినిమాను ఆ స్క్రీన్‌ లో ప్రేక్షకులు చూడబోతున్నారు. ఇప్పటి వరకు అతికొద్ది ఇండియన్‌ సినిమాలు మాత్రమే ఈ పెద్ద స్క్రీన్‌ పై ప్రదర్శితం అయ్యాయి. వాటి జాబితాలో అల వైకుంఠపురంలో కూడా చోటు దక్కించుకుంది.

అల వైకుంఠపురంలో సినిమాలో బన్నీ లుక్‌ చాలా విభిన్నంగా ఉంది. ఇప్పటి వరకు బన్నీ పాత్ర ఏంటీ.. స్టోరీ లైన్‌ ఏంటీ అనే విషయాలపై త్రివిక్రమ్‌ క్లారిటీ ఇవ్వలేదు. ఈ చిత్రంలో కీలక పాత్రను టబు పోషించడంతో మరింత ఆసక్తి పెరిగింది. ఇక బన్నీకి జోడీగా ఈ చిత్రంలో ముద్దుగుమ్మ పూజా హెగ్డే నటించిన విషయం తెల్సిందే. ఇప్పటికే విడుదలైన పాటలు సినిమా పై అంచనాలు పెంచేశాయి. నేడు టీజర్‌ విడుదల కాబోతుంది. టీజర్‌ విడుదల తర్వాత సినిమాకు మరింత క్రేజ్‌ రావడం కన్ఫర్మ్‌ అంటూ కామెంట్స్‌ వస్తున్నాయి.


Tags:    
  • Alavaikunthapurramuloo 
  • Samajavaragamana 
  • Tollywood 
  • Tollywood Latest Movie Updates 
  • Tollywood News 
  • Tupaki News 
  • Tupaki Updates 
  • Imax Melbourne 

Similar News

రాజకీయాల నుంచి వెండితెరకు అసాధారణ ప్రయాణం!

2026-11-06 07:30 GMT

'సమ్మర్ హాలిడేస్' రివ్యూ

2026-11-06 07:23 GMT

ఫ్లాపుల తర్వాత రామ్ మాస్టర్ ప్లాన్.. 2027లో రెండు సినిమాల రిలీజ్‌కు రెడీ!

2026-11-06 06:30 GMT

సూర్యకు మళ్లీ 30 కోట్ల టార్గెట్

2026-11-06 05:49 GMT

కాజల్‌కు ఈ పార్ట్ 2 కష్టాలేంటి!

2026-11-06 05:49 GMT

కన్నుగీటుతూ కుర్రకారు గుండెల్లో గుబులు పుట్టిస్తున్న జాన్వీ కపూర్!

2026-11-06 05:45 GMT

భారీ బడ్జెట్ అంటే ఈ రెండు బ్యానర్లే గుర్తొస్తున్నాయా!

2026-11-06 05:06 GMT

రామాయణం కలెక్షన్స్.. ఓపెనింగ్స్ ఓకే కానీ!

2026-11-06 05:05 GMT

వారణాసి: ఇక స్ట్రాంగ్‌గా మొదలవ్వాలి!

2026-11-06 05:03 GMT

ఆదిపురుష్, రామాయణం.. తేడా అక్కడే కనిపించింది!

2026-11-06 04:06 GMT

స్టార్ హీరో బిగ్ మిస్టేక్.. అందుకే ర‌చ‌యిత‌లు అల‌క‌బూనారా?

2026-11-06 03:57 GMT

సౌత్ సినిమాలో చ‌రిత్ర సృష్టించిన‌ టాప్ -4 సౌండ్ ఇంజినీర్లు

2026-11-06 03:56 GMT

Copyright @2026

Powered by Blink CMS