చిన్న కూతురు కూడా చేరిపోయిందింగా!!

Update: 2016-04-30 10:48 GMT
కమల్ హాసన్ మూవీ అంటేనే ఏదో ఒక స్పెషాలిటీ ఉంటుంది. అలాంటిది ఇప్పుడీ విశ్వనటుడు చేయబోతున్న చిత్రానికి చాలా ప్రత్యేకతలు ఉంటున్నాయి. ఇప్పటికే కమల్ కొత్త మూవీ శభాష్ నాయుడులో పెద్ద కూతురు శృతిహాసన్ యాక్ట్ చేస్తున్న విషయం తెలిసిందే.

ఇప్పుడు శభాష్ నాయుడులో కమల్ హాసన్ చిన్న కూతురు కూడా యూనిట్ లోకి వచ్చి చేరింది. శృతి హాసన్ యాక్టింగ్ లో భాగమవుతోంది. ఈ రియల్ డాటర్ ఆన్ స్క్రీన్ పై కూడా కమల్ కి కూతురుగానే నటిస్తోంది. కానీ చిన్న కూతురు అక్షర హాసన్ మాత్రం.. విభిన్నంగా టెక్నికల్ టీంలో చేరింది. దర్శకుడు రాజీవ్ కుమార్ కి అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేయనుంది అక్షర హాసన్. కమల్ అంటేనే మల్టీ ట్యాలెంటెడ్. ఈయన కూతుళ్లు కూడా ఇలా రకరకాల ట్యాలెంట్ చూపించేవారే. శృతిహాసన్ యాక్టింగ్ తోపాటు పాటలు పాడుతుందనే విషయం మనకు తెలుసు. ఇప్పుడు అక్షర డైరెక్షన్ డిపార్ట్ మెంట్ లో సత్తా చాటుతానంటోంది.

'అక్షర హాసన్ శభాష్ నాయుడు యూనిట్ లో అధికారికంగా భాగమైంది. తొలిసారిగా కమల్ ఇద్దరు కూతుళ్లతో కలిసి పని చేస్తున్నారు' అంటున్నాయి యూనిట్ వర్గాలు. తెలుగు, తమిళ్, హిందీల్లో ఒకేసారి తెరకెక్కనున్న శభాష్ నాయుడు.. మే 16 నుంచి షూటింగ్ ప్రారంభించుకోనుండగా.. రమ్యకృష్ణ కమల్ కి భార్యగా నటిస్తోంది, బ్రహ్మానందం ఈ మూవీలో కీలక పాత్ర పోషిస్తుండగా.. ఇళయరాజా మ్యూజిక్ ఇస్తున్నారు.
Tags:    

Similar News