• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  అవకాశం కోసం ఆకలితో వెయిట్...

అవకాశం కోసం ఆకలితో వెయిట్ చేస్తున్న ముంబై బ్యూటీ!

By - Tupaki Desk
Update: 2020-06-10 16:30 GMT
డైరెక్టర్ పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కిన యువత సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి హీరోయిన్ గా పరిచయం అయింది ముంబై బ్యూటీ అక్ష. తొలి సినిమాలో యంగ్ హీరో నిఖిల్ కి జంటగా నటించి ప్రేక్షకులను బాగానే ఆకట్టుకున్న ఈ ముంబై మోడల్ అక్ష తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. అయితే ఈ అమ్మడు కొత్తగా వచ్చినప్పుడు స్టార్ హీరోయిన్ అవుతుందని అనిపించింది. కానీ ఎందుకో గాని హీరోయిన్ గా మాత్రం తెలుగు ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా ఎదగలేక పోయింది. దీనికి తోడు కథల ఎంపిక విషయంలో సరైన అవగాహన లేకపోవడం వల్ల ఈ అమ్మడు ఎక్కువగా పరాజయాలు ఎదుర్కోవాల్సి వచ్చింది. నటించిన కొన్ని సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద దారుణంగా బోల్తా కొట్టాయి. అయితే అక్ష ఎనిమిదో తరగతి చదువుతున్నప్పుడే మోడలింగ్ రంగంలో ఆసక్తి కనబరిచిందట. అందుకే ఆమె తల్లిదండ్రులు మోడలింగ్ లో శిక్షణ ఇప్పించారు.

ఆ విధంగా ఈ గుమ్మ ఒకవైపు మోడలింగ్ చేస్తూనే మరోవైపు హీరోయిన్ గా అవకాశాలు దక్కించుకుంది. అయితే మొదటిగా అక్ష 2004వ సంవత్సరంలో ముసాఫర్ అనే బాలీవుడ్ చిత్రంలో ప్రాధాన్యత ఉన్నటువంటి పాత్రలో నటించి సినీ పరిశ్రమకు పరిచయం అయింది. అయితే తెలుగులో ఈ అమ్మడు నటించిన యువత.. రైడ్.. రయ్ రయ్ అంటూ కొన్ని సినిమాల ద్వారా కాస్త గుర్తింపు తెచ్చుకుంది. అయితే అందం.. అభినయం.. ప్రతిభ ఉన్న అక్షకు తెలుగులో అవకాశాలు మాత్రం కరువయ్యాయని చెప్పాలి. ఈ అమ్మడు హీరోయిన్ గానే కాకుండా గెస్ట్ అప్పియరెన్స్ పాత్రలలో కూడా నటించింది. కానీ ఆ పాత్రలకు పెద్దగా గుర్తింపు లేకపోవడంతో ఎవరు గుర్తించ లేదు. అయితే అక్ష తెలుగు మాత్రమే కాదు..

తమిళం, కన్నడ భాషలలో కూడా హీరోయిన్ గా తన అదృష్టం పరీక్షించుకుంది. అయితే చివరిగా శర్వానంద్ హీరోగా నటించిన రాధా అనే సినిమాలో రుక్మిణి పాత్రలో కనిపించింది. ఆ తరువాత మళ్లీ ఇప్పటి వరకు తెలుగులో ఈ అమ్మడు నటించలేదు. అయితే సోషల్ మీడియాలో కూడా అరుదుగా కనబడే అక్ష తాజాగా ఓ ఫోటో పోస్ట్ చేసింది. బ్లాక్ అండ్ వైట్ లుక్ లో రొమాంటిక్ పోజుతో తన అందాలన్నీ ప్రదర్శిస్తుంది. షర్ట్ బటన్ తీసేసి యూత్ మతి పోగొడుతుంది. కుర్రకారు ఈ భామ అక్షనా.. అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అయితే అవకాశాలు కరువై ఇలా చేస్తుందని మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. మంచి అవకాశం కోసం ఆకలితో వెయిట్ చేస్తున్నట్లు ఉంది అక్ష. చూడాలి మరి త్వరలో ఏదైనా సినిమాతో మళ్లీ కంబ్యాక్ అవుతుందేమో..!
Tags:    
  • Aksha 

Similar News

విడుదలకు ముందే కేక పెట్టిస్తున్న కాకా..!

2026-11-05 08:06 GMT

నేచుర‌ల్ అందంతో జెన్ Zని క‌వ్విస్తున్న డెబ్యూ న‌టి

2026-11-05 08:06 GMT

అన్ని పుకార్ల‌కు చెక్.. 'దాదా' ఫిక్స‌యితే ద‌బిడి దిబిడే!

2026-11-05 07:53 GMT

ఇదేమి కన్ఫ్యూజన్ నాని.. అది ఇది కాదు.. అదే ఇది..!

2026-11-05 07:53 GMT

'రామాయణం' మూవీ రివ్యూ

2026-11-05 07:40 GMT

బాకీలు ఎగ్గొట్టిన మ్యూజిక్ డైరెక్టర్.. దేవుడికి కంప్లైంట్!

2026-11-05 07:36 GMT

మళ్లీ వోగ్ కవర్‌పై కత్రినా.. ఫ్యాన్స్‌కు స్పెషల్ ట్రీట్!

2026-11-05 07:35 GMT

ఈ దీపావళికి పెద్దగా సౌండ్ చేయలేకపోయిన టాలీవుడ్!

2026-11-05 07:27 GMT

కీర్తి సురేష్.. మరోసారి లెక్క తప్పిందా..

2026-11-05 07:23 GMT

సంక్రాంతి బాక్సాఫీస్ రేసు - 1000 కోట్ల బిజినెస్ అంచనా!

2026-11-05 07:21 GMT

తరుణ్ భాస్కర్.. నెక్స్ట్ ఆ హీరో దగ్గరికేనా!

2026-11-05 07:17 GMT

రహస్యం బయటపెట్టిన భాగ్యశ్రీ.. ఆ టాలెంట్ కూడా ఉందా?

2026-11-05 07:03 GMT

Copyright @2026

Powered by Blink CMS