అఖిల్ సెకండ్ టైటిల్ పై 'నిర్ణయం'

Update: 2017-06-21 12:55 GMT
అక్కినేని అఖిల్ తన రెండో సినిమా షూటింగ్ చేసేస్తున్నాడు. విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం కోసం.. ఇప్పటికే పలు యాక్షన్ సీక్వెన్స్ ల చిత్రీకరణ కూడా జరిగింది. యాక్షన్ అండ్ రొమాన్స్ జోనర్ లో ఈ మూవీ ఉండనుందని తెలుస్తోంది. ఈ మూవీ టైటిల్ పై ముందు నుంచి ఓ టాక్ గట్టిగానే వినిపిస్తోంది.

'జున్ను' అంటూ టైటిల్ పెడదామని.. దర్శకుడు విక్రమ్ కె కుమార్ గట్టిగా పట్టు పడుతున్నట్లుగా వార్తలు వచ్చాయి. జున్నుకి సోషల్ మీడియా నుంచి కూడా నెగిటివ్ రియాక్షన్ వచ్చింది. దీంతో జాగ్రత్త పడ్డ నిర్మాత నాగార్జున.. క్యాచీ టైటిల్ కోసం అన్వేషించారు. ఇప్పుడు అఖిల్ సెకండ్ మూవీపై టైటిల్ 'నిర్ణయం' జరిగిపోయినట్లు తెలుస్తోంది. 'హలో గురూ ప్రేమ కోసమే' అనే టైటిల్ ను పైనల్ చేసుకున్నారన్నది లేటెస్ట్ టాక్. తండ్రి నాగార్జున.. తల్లి అమల కలిసిన నటించిన 'నిర్ణయం' మూవీలోని సూపర్ హిట్ సాంగ్ 'హలో గురూ ప్రేమ కోసమేరా జీవితం' నుంచి ఈ టైటిల్ ను తీసుకున్నారనే సంగతి అర్ధమవుతోంది.

ఇక ఈ చిత్రంలో హీరోయిన్ ఎవరనే విషయంపై ఇంకా సస్పెన్స్ కంటిన్యూ అవుతూనే ఉంది. హీరోయిన్ ను ఇంకా నిర్ణయించలేదని చెబుతున్నా.. ఇప్పటికే ఫైనల్ చేసేశారని.. త్వరలో హీరోయిన్ పేరును గ్రాండ్ గా అనౌన్స్ చేసి షాక్ ఇవ్వాలని నాగ్ డిసైడ్ అయ్యారని టాక్.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News