• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  బిబి4 : హారిక కెప్టెన్‌...

బిబి4 : హారిక కెప్టెన్‌ అవ్వడం జీర్ణించుకోలేక సహనం కోల్పోయిన అఖిల్‌

By - Tupaki Desk
Update: 2020-11-21 06:04 GMT
బిగ్‌ బాస్‌ ప్రస్తుతం ఉన్న కంటెస్టెంట్స్‌ లో అఖిల్‌ టాప్‌ 5 లో ఉంటాడనే నమ్మకం చాలా మందిలో ఉంది. కాని ఆయన ఈమద్య కాలంలో బాగా వ్యతిరేకత కూడగట్టుకుంటూ ఉన్నాడు. అతడు సీక్రెట్‌ రూంకు వెళ్లిన తర్వాత మొత్తం అతడి గురించి జనాల్లో తప్పుగా వెళ్తుంది. అతడు బయటకు వచ్చిన తర్వాత వ్యవహరించిన తీరు విమర్శల పాలయ్యింది. మేకలా వెళ్లిన నేను పులిలా వచ్చాను అంటూ చేసిన వ్యాఖ్యలు చాలా మందిక నవ్వు తెప్పించాయి. ఇక తాజా ఎపిసోడ్‌ లో అఖిల్‌ వ్యవహరించిన తీరు మరింతగా అతడిపై వ్యతిరేకత కలిగేలా చేసింది అనడంలో ఎలాంటి సందేహం లేదు.

కమాండో టాస్క్‌ లో భాగంగా ఉత్తమ ప్రదర్శణ కనబర్చిన అఖిల్‌, అభిజిత్‌ మరియు హారికలు కెప్టెన్సి టాస్క్‌ లో పోటీ పడ్డారు. ఆ టాస్క్‌ లో భాగంగా కెప్టెన్సీ దారులను వారి మద్దతు దారులు ఎత్తుకుని ఉండాలి. ఎవరు ముందు కాలు కింద పెడితే వారు కెప్టెన్సీ పోటీ నుండి తప్పుకోవడం జరుగుతుంది. ముందుగానే అభిజిత్‌ ను అవినాష్ ఎత్తుకునేందుకు ముందుకు వచ్చాడు. అఖిల్‌ ను అంతా అనుకున్నట్లుగానే సోహెల్‌ బుజాలపై వేసుకుని మోసేందుకు ముందుకు వచ్చాడు. హారికను మోనాల్‌ మోసేందుకు ముందుకు వచ్చింది. టాస్క్‌ బజర్‌ మోగే సమయంకు రెడీ అయ్యారు.

బజర్‌ మోగిన వెంటనే ముగ్గురు వారి మద్దతుదారుల మీదకు ఎక్కారు. మొదట అభిజిత్‌ ను మోయలేక అవినాష్‌ కిందకు దించాడు. ఆ తర్వాత సోహెల్‌ చాలా ప్రయత్నించాడు. కాని అఖిల్‌ ను మోయడం కష్టం అయ్యింది. దాంతో రెండవ కంటెస్టెంట్‌ అఖిల్‌ కూడా కిందకు దిగడంతో హారిక విజయం సాధించింది. మోనాల్‌ సాయంతో హారిక బిగ్‌ బాస్‌ ఇంటి కెప్టెన్‌ అయ్యింది. ఆ ఆనందంలో ఆమె చేసిన హడావుడి మామూలుగా లేదు.

కెప్టెన్సీ మోనాల్‌ వల్ల కోల్పోవడంతో అఖిల్‌ తట్టుకోలేక పోయాడు. సహనం కోల్పోయి గట్టిగా అరుస్తూ మంచంపై పిడిగుద్దులు గుద్దాడు. ఆ సమయంలో మోనాల్‌ వచ్చినా ఆమెను అక్కడి నుండి వెళ్లి పోవాల్సిందిగా కోరాడు. హారిక కెప్టెన్‌ అవ్వడం అఖిల్‌ కు ఏమాత్రం ఇష్టం లేకుండా కనిపించింది. ఓటమిని అంగీకరించని అఖిల్‌ పై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. కష్టపడి మోనాల్‌ హారికను కెప్టెన్‌ గా చేయడం అఖిల్‌ కు అస్సలు నచ్చలేదు. దాంతోనే అసహనంతో కాస్త సైక్‌ అయ్యాడు. నేటి ఎపిసోడ్‌ లో ఆ విషయమై నాగార్జున ఏమైనా మాట్లాడేనా చూడాలి.
Tags:    
  • Bigg boss 
  • Bigg boss Season 4 
  • Tollywood 
  • Star Maa Bigg Boss 
  • Nagarjuna 
  • Tarun 
  • Tupaki News 
  • Mahesh Babu 
  • Tupaki Updates 

Similar News

రణ్‌బీర్‌కి ఇలా, యష్‌కి అలా…రామాయణం మూవీ వెనుక ఇంట్రెస్టింగ్ సీక్రెట్స్..!

2026-11-20 10:20 GMT

బ‌న్నీ రేసులో బోయ‌పాటి నెంబ‌ర్ - 4!

2026-11-20 10:20 GMT

పండంటి మగ బిడ్డకి జన్మనిచ్చిన సమంత.. కొడుకు పేరు ఏమిటంటే?

2026-11-20 09:21 GMT

సౌత్ ఇండ‌స్ట్రీపై రాజ‌మండ్రి బ్యూటీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు!

2026-11-20 09:21 GMT

Allu Aravind Three Stars: చిరు, చరణ్, బన్నీ..!

2026-11-20 08:28 GMT

'ఓం' మూవీ రివ్యూ

2026-11-20 08:27 GMT

తెలిసిన వారినే ప్రశ్నించడానికి ఎందుకు వెనుకాడుతున్నాం?

2026-11-20 08:23 GMT

సూపర్‌స్టార్ పక్కన చిన్నపిల్లలా అందాల రాశీఖ‌న్నా!

2026-11-20 07:38 GMT

తొలుత అర్థం కాలేదు.. తెలిశాక వివరించే ప్రయత్నం చేశా!

2026-11-20 07:36 GMT

మృత్యువు అంచుల నుంచి కాజల్ అగర్వాల్‌కు తప్పిన ప్రమాదం..!

2026-11-20 06:45 GMT

'గాడ్జిల్లా'పై 'రామాయ‌ణం' ఇంపాక్ట్ ఎంత‌?

2026-11-20 06:43 GMT

సొంత థియేటర్‌పై ఫిర్యాదు.. అల్లు అరవింద్ రియాక్షన్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

2026-11-20 06:42 GMT

Copyright @2026

Powered by Blink CMS