• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  బావ కోసం...

బావ కోసం చైతూ-నాగ‌చైత‌న్య‌

By - Tupaki Desk
Update: 2016-08-06 04:08 GMT
మెగాస్టార్ చిరంజీవి త‌న మేన‌ల్లుళ్ల మీద ఫోక‌స్ పెట్టిన‌ట్లు.. వాళ్ల‌కు తోడ్పాటు అందించిన‌ట్లు అక్కినేని నాగార్జున త‌న మేన‌ల్లుళ్ల మీద దృష్టిపెట్ట‌ట్లేద‌ని ఓ విమ‌ర్శ ఉంది. సుమంత్‌.. సుశాంత్ హీరోలుగా నిల‌దొక్కుకోవ‌డానికి చాలా శ్ర‌మిస్తున్న నేప‌థ్యంలో ఇలాంటి కామెంట్లు వ‌స్తున్నాయి. ఐతే ఈ మాట‌లు నాగార్జున చెవిన కూడా ప‌డ్డాయో ఏంటో.. త‌న చిన్న మేన‌ల్లుడు సుశాంత్ కోసం త‌న వంతు తోడ్పాటు అందించ‌డానికి సిద్ధ‌మైన‌ట్లున్నాడు.  సుశాంత్ కొత్త సినిమా ‘ఆటాడుకుందాం రా’ కోసం త‌న కొడుకులిద్ద‌రినీ రంగంలోకి దించాడు నాగ్‌. ఈ సినిమాలో చైతూ-అఖిల్ ఇద్ద‌రూ త‌ళుక్కుమ‌న‌బోతుండ‌టం విశేషం.

నాగ‌చైత‌న్య ‘ఆటాడుకుందాం రా’లో క్యామియో రోల్ చేస్తుండ‌గా.. అఖిల్ ఒక స్పెష‌ల్ సాంగ్ చేస్తుండ‌టం విశేషం. ఈ విష‌యాన్ని సీనియ‌ర్ పీఆర్వో బీఏ రాజు క‌న్ఫ‌మ్ చేశారు. మ‌నం త‌ర్వాత అక్కినేని అన్న‌ద‌మ్ములిద్ద‌రూ ఒక సినిమాలో క‌నిపించ‌బోతోంది ‘ఆటాడుకుందాం రా’లోనే. ఇప్ప‌టిదాకా సుశాంత్ స‌క్సెస్ రుచి చూడ‌లేదు. చేసిన మూడు సినిమాలూ ఫ్లాపులే. ఈ నేప‌థ్యంలో ‘ఆటాడుకుందాం రా’ అత‌డి కెరీర్ కు ఎంతో కీల‌కం. ఐతే ఈ సినిమాకు అనుకున్న స్థాయిలో హైప్ రాలేద‌నుకుంటున్న త‌రుణంలో చైతూ-అఖిల్ ఈ సినిమాలో ఉన్నార‌న్న స‌మాచారం సినిమాకు క‌లిసొచ్చేదే. మ‌రి ఈ సినిమాలో కొడుకుల‌తో పాటు నాగార్జున కూడా త‌ళుక్కుమంటాడేమో చూడాలి.
Tags:    
  • Akhil 
  • Naga chaitanya 
  • Sushant 

Similar News

విజయేంద్ర ప్రసాద్.. ఏం చేస్తున్నారు?

2026-11-04 01:30 GMT

ఆప‌రేష‌న్ సింధూర్‌పై పాన్ ఇండియ‌న్ సినిమా.. యువ‌హీరో జాక్‌పాట్!

2026-11-04 00:30 GMT

డిసెంబర్‌లో తెలుగు సినిమాలకు హాలీవుడ్ టెన్షన్!

2026-11-03 23:30 GMT

హాలీవుడ్‌లో ఆర్నాల్డ్- కోలీవుడ్‌లో మ్యాడీ ఇద్ద‌రిదీ ఒకటే బాట‌!

2026-11-03 22:30 GMT

పాన్ ఇండియా సినిమాలకు.. ప్రస్తుత కాలం పనికిరాదా?

2026-11-03 19:30 GMT

ఆ అలవాటే 50 ఏళ్లలో కూడా వచ్చింది..జయసుధ కామెంట్స్ వైరల్

2026-11-03 18:30 GMT

Bigg Boss Telugu 10: ఈ వారం ఎలిమినేట్ అవ్వబోయేది వర్షిణినా?

2026-11-03 18:23 GMT

Bigg Boss Telugu 10: ముకేశ్ హీరో అవుతాడా, లేక జీరో అవుతాడా?

2026-11-03 18:23 GMT

వారణాసి: RRR కంటే 40 రోజులు తక్కువ!

2026-11-03 18:18 GMT

పాన్ ఇండియాను దాటి పాన్ వరల్డ్‌కు.. అన్ని భాషల స్టార్ట్స్ తో కలిసి రాజమౌళి సినిమా!

2026-11-03 18:16 GMT

రామాయ‌ణ (X) కింగ్: ప్రీరిలీజ్ బిజినెస్‌లో ఎవ‌రు ది బెస్ట్?

2026-11-03 18:10 GMT

న్యూజిలాండ్లో వెకేషన్ మోడ్‌లో నవదీప్‌ గ్యాంగ్ సందడి!

2026-11-03 18:09 GMT

Copyright @2026

Powered by Blink CMS