బిబి4 : అఖిల్‌ వర్సెస్‌ అభిజిత్‌ మద్యలో మోనాల్‌

Update: 2020-10-06 04:00 GMT
బిగ్‌ బాస్‌ అయిదవ వారంలోకి అడుగు పెట్టింది. ఇప్పటికే ఇంటి నుండి నలుగురు ఎలిమినేట్‌ అయ్యి వెళ్లి పోయారు. ఈ వారం ఎలిమినేషన్‌ కు నామినేషన్‌ జరిగింది. నిన్నటి ఎపిసోడ్‌ మొత్తం ఎలిమినేషన్‌ నామినేషన్‌ పక్రియనే టెలికాస్ట్‌ చేయడం జరిగింది. చాలా హాట్‌ హాట్‌ గా ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ మొత్తం మాస్క్‌ తీసేసి గేమ్‌ ఆడేసి నామినేట్‌ చేశారు.

ఈ సీజన్‌ లో ఇప్పటి వరకు సేఫ్‌ గేమ్‌ ఆడుతూ వచ్చిన వారు అంతా కూడా నిన్నటి ఎపిసోడ్‌ లో మాస్క్‌ తీసేసినట్లుగా అనిపించింది. మొత్తానికి నిన్నటి ఎపిసోడ్‌ ముఖ్యంగా అఖిల్‌ వర్సెస్‌ అభిజిత్‌ అన్నట్లుగా సాగింది. మొదటి వారం నుండి అభిజిత్‌ తన ఏజ్‌ మరియు ఎడ్యుకేషన్‌ గురించి మాట్లాడాడు అంటూ అఖిల్‌ చెబుతూ వస్తున్నాడు. ఈసారి కూడా అదే రీజన్‌ తో అభిజిత్‌ ను అఖిల్‌ నామినేట్‌ చేశాడు

అఖిల్‌ ప్రారంభించిన పక్రియ ఒకరి తర్వాత ఒకరు అన్నట్లుగా కొనసాగుతూ వచ్చింది. అభిజిత్‌ వద్దకు పక్రియ వచ్చేప్పటికి గొడవ పెద్దది అయ్యింది. అఖిల్‌ ను అభిజిత్‌ నామినేట్‌ చేసిన సమయంలో ఇద్దరి మద్య గొడవ ముదిరింది. వేలు చూపించి మాట్లాడవద్దంటూ అభిజిత్‌ కు అఖిల్‌ సూచించడంతో నువ్వు ఎప్పుడు చేసేది అదే. మళ్లీ మళ్లీ పాత విషయాలను గుర్తు చేసుకుంటూ గొడవ పెంచాలని చూస్తున్నావంటూ అభిజిత్‌ అన్నాడు.

ఆ సమయంలో నువ్వు ఆరోజు కూడా మోనాల్‌ కు వేలు చూపించి మాట్లాడావు అంటూ అఖిల్‌ ఆగ్రహం వ్యక్తం చేయడంతో అభిజిత్‌ స్పందిస్తూ ఆమె విషయంలో నీవు ఎందుకు మాట్లాడుతున్నావు. అసలు ఆమె నీకు ఏంటీ అంటూ సూటిగా ప్రశ్నించాడు. ఫ్రెండ్‌ కు డిపెండ్‌ చేస్తున్నాను అంటూ అఖిల్‌ మాట్లాడగా అందుకు మేమిద్దరం ఇప్పటికే మాట్లాడేసుకున్నాం అంటూ అభిజిత్‌ చెప్పేశాడు.

ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ తన పేరు తీసుకు రావడంపై మోనాల్‌ చాలా సీరియస్‌ అయ్యింది. ఇది ఒక జాతీయ మీడియా ఇలాంటి ప్లాట్‌ ఫామ్‌ పై మీరు నన్ను బ్యాడ్‌ చేసేలా మాట్లాడుతున్నారు. అంటూ గొంతు చించుకుని అరుస్తూ కన్నీరు పెట్టుకుంది. ఆమె ను ఇంటి సభ్యులు అంతా ఓదార్చారు.

సోహెల్‌ తన కోపం గురించి అభిజిత్‌ మాట్లాడిన సమయంలో మళ్లీ రెచ్చి పోయాడు. అభిజిత్‌ మరియు అఖిల్‌ ల గొడవ మద్యలో కూడా సోహెల్‌ వచ్చి ఆ వేడిని మరింత పెంచాడు. సోహెల్‌ తీరును దివి కూడా తప్పుబట్టింది. నీవు నీ కోపాన్ని తగ్గించుకుంటే బాగుంటుంది అంటూ సూచించడంతో సోహెల్‌ మరింత ఆవేశంతో రెచ్చిపోయాడు. మొత్తానికి నిన్నటి ఎపిసోడ్‌ అంతా కూడా రచ్చ రచ్చగా సాగింది.
Tags:    

Similar News