• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  'ఇది నా లైఫ్ లో...

'ఇది నా లైఫ్ లో మరచిపోలేని జర్నీ'

By - Tupaki Desk
Update: 2021-11-19 16:22 GMT
యూత్ కింగ్ అఖిల్ అక్కినేని తొలి సినిమా నుంచి మాంచి కమర్షియల్ హిట్ కోసం ఎదురుచూస్తున్నారు. అలాంటి సక్సెస్ ఆరేళ్ళ తర్వాత ''మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్'' మూవీతో దక్కింది. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. దసరా సందర్భంగా థియేటర్లలోకి వచ్చిన ఈ రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అశేష ప్రేక్షకాదరణ పొందింది. యాభై కోట్లకు పైగా వసూళ్ళు రాబట్టి బ్లాక్ బస్టర్ గా నిలిచింది. థియేటర్లలో ఘనవిజయం సాధించిన ఈ చిత్రం ఇప్పుడు డిజిటల్ మాధ్యమంలోకి వచ్చింది.

తెలుగు ఓటీటీ ఫ్లాట్ ఫార్మ్ 'ఆహా' వీడియోలో ''మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్'' సినిమా శుక్రవారం (నవంబర్ 19) నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. ఈ నేపథ్యంలో అఖిల్ ట్వీట్ చేస్తూ.. తన లైఫ్ లో మర్చిపోలేని ప్రయాణాల్లో ఇదొకటని అన్నారు. ''నా జీవితంలో మరచిపోలేని ప్రయాణాలలో ఒకటి. ఈ స్పెషల్ సినిమాని మీరందరూ ఆదరిస్తారని ఆశిస్తున్నాను. ఇది చాలా ప్రేమతో మరియు అభిరుచితో రూపొందించబడింది. 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్' చిత్రాన్ని ఇప్పుడే ఆహా లో చూడండి'' అని అఖిల్ ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు.

కాగా, 'మోస్ట్ ఎలిజిబుల్' చిత్రాన్ని అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 బ్యానర్ పై బన్నీ వాసు - వాసు వర్మ సంయుక్తంగా నిర్మించారు. ఇందులో అఖిల్ సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటించింది. ఈషా రెబ్బా - నేహా శెట్టి - ఫారియా అబ్దుల్లా అతిథి పాత్రలో కనిపించి సందడి చేశారు. గోపి సుందర్ ఈ చిత్రానికి మంచి సంగీతం సమకూర్చగా.. ప్రదేశ్ శర్మ సినిమాటోగ్రఫీ అందించారు. బిగ్ స్క్రీన్ మీద భారీ విజయాన్ని నమోదు చేసిన ఈ సినిమా స్మాల్ స్క్రీన్ పై ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో చూడాలి.

ఇకపోతే అఖిల్ బ్లాక్ బస్టర్ జోష్ లో రెట్టింపు ఉత్సాహంతో ''ఏజెంట్'' సినిమా చేస్తున్నారు. స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో అఖిల్ ఓ స్పై గా కనిపించనున్నారు. ఇన్నాళ్లూ లవర్‌ బాయ్‌ పాత్రలు చేసిన అఖిల్.. ఈ సినిమా కోసం సరికొత్త లుక్ లో మారిపోయారు. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాల్లో అక్కినేని వారసుడిని చూసి అందరూ వావ్ అన్నారు. సాక్షి వైద్య ఇందులో హీరోయిన్ గా నటిస్తుండగా.. మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి కీలక పాత్ర పోషిస్తున్నారు. ఏకే ఎంటర్టెన్మెంట్స్ మరియు సురెండర్2 సినిమాస్ బ్యానర్స్ పై రామబ్రహ్మం సుంకర - సురేందర్ రెడ్డి కి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న ఈ స్పై థ్రిల్లర్ ని వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.
Tags:    
  • Most Eligible Bachelor 
  • Pooja Hegde 
  • Akhil Akkineni 
  • Tollywood 
  • Movie News 
  • Latest News 
  • Telugu News 

Similar News

'వార‌ణాసి' త‌ర్వాత ప్రియాంక చోప్రా టాలీవుడ్‌కి బైబై

2026-11-11 01:46 GMT

బాలకృష్ణ అంటే భయపడ్డా.. ఆయన మంచితనం చూసి షాకయ్యా: సీనియర్ హీరోయిన్ సంఘవి

2026-11-11 01:45 GMT

రాజమౌళిని తిడతారా.. వారణాసిని ఆపుతారా?: ప్రకాష్ రాజ్ కామెంట్స్

2026-11-11 01:45 GMT

మాయ లేడీ సెన్సార్.. క్రేజీ క్రేజీగా హీరో గారి వేషాలు

2026-11-11 01:42 GMT

`కాకా` మీద చ‌ర‌ణ్‌కి మ‌రీ అంత న‌మ్మ‌క‌మేంటో?

2026-11-11 01:41 GMT

ఆ స్టార్ కోసం ఆగిపోయిన కథ.. మళ్ళీ రాస్తాడట

2026-11-11 01:41 GMT

ఔను..వాళ్లిద్దరూ కూడా విడిపోతున్నారంట..!

2026-11-11 01:41 GMT

చిరు మాట ఇచ్చారు సరే.. వెంకీకి మళ్ళీ మెగా ఛాన్స్ దక్కేనా?

2026-11-10 18:30 GMT

ISKCON వ్యవస్థాపక ఆచార్యులు శ్రీ‌ల ప్ర‌భుపాద్‌ బ‌యోపిక్..హోంబలే సంచలనం!

2026-11-10 17:30 GMT

తమిళ ఇంటర్వ్యూలో తెలుగు సినిమాకు ఎలివేషన్

2026-11-10 16:30 GMT

డైరెక్టర్ టు హీరో.. భాషతోపాటు క్యారెక్టర్ మార్చిన తరుణ్ భాస్కర్.. వర్కౌట్ అయ్యేనా?

2026-11-10 15:30 GMT

వైట్ క్రాప్ టాప్‌లో గ్లామర్ ట్రీట్ ఇచ్చిన దిశా పటానీ!

2026-11-10 14:30 GMT

Copyright @2026

Powered by Blink CMS