• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  అఖిల్ టీమ్ ఆ విష‌యంలో...

అఖిల్ టీమ్ ఆ విష‌యంలో వెన‌క్కి త‌గ్గుతోందా?

By - Tupaki Desk
Update: 2022-11-07 23:30 GMT
2023 సంక్రాంతికి ప‌లు క్రేజీ సినిమాలు పోటీ ప‌డుతున్న విష‌యం తెలిసిందే. చాలా వ‌ర‌కు సినిమాలు ఇప్ప‌టికే సంక్రాంతి వార్ కు సై అంటూ ప్ర‌క‌టించేశాయి కూడా. ఇందులో ముందుగా ప్ర‌భాస్ న‌టిస్తున్న తొలి మైథ‌లాజిక‌ల్ మూవీ `ఆది పురుష్‌` సంక్రాంతి బ‌రిలో జ‌న‌వ‌రి 12న దింపేస్తున్నామంటూ ప్ర‌క‌టించేశారు. ఐదు భాష‌ల్లో రిలీజ్ కానున్న సినిమా కాడం, ప్ర‌భాస్ న‌టించిన తొలి మైథ‌లాజిక‌ల్ డ్రామా కావ‌డంతో ఈ మూవీ సంక్రాంతి బ‌రిలో బిగ్ పోటీని ఇవ్వ‌డం ఖాయం అని అంతా అనుకున్నారు.

ఇదిలా వుంటే ఈ మూవీ రిలీజ్ ని జూన్ 16కు వాయిదా వేస్తున్నామంటూ చిత్ర బృందం ప్ర‌క‌టించి షాకిచ్చింది. ఈ మూవీ వీఎఫ్ ఎక్స్ పై వ‌స్తున్న విమ‌ర్శ‌ల నేప‌థ్యంలో చిత్ర బృందం మ‌ళ్లీ రీ వ‌ర్క్ చేయ‌డానికి రెడీ అయిపోయింది. ఇందు కోసం రూ. 100 కోట్లు కేటాయించి వీఎఫ్ ఎక్స్ ని మ‌రింత ప‌క్కాగా సిద్దం చేయ‌బోతోంది. ఆ కార‌ణంగానే `ఆది పురుష్‌` రిలీజ్ ని వాయిదా వేసింద‌ని తెలుస్తోంది.

ఇదిలా వుంటే సంక్రాంతి రేసు నుంచి `ఆది పురుష్` త‌రువాత మ‌రో సినిమా కూడా త‌ప్పుకున్న‌ట్టుగా తెలుస్తోంది. అక్కినేని అఖిల్ న‌టిస్తున్న స్పై యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ `ఏజెంట్‌`. సురేంద‌ర్ రెడ్డి డైరెక్ష‌న్ లో అనిల్ సుంక‌ర ఈ మూవీని నిర్మిస్తున్నారు. మ‌మ్ముట్టి కీల‌క అతిథి పాత్ర‌లో న‌టిస్తున్న ఈ మూవీని ఫైన‌ల్ గా సంక్రాంతికి రిలీజ్ చేయాల‌ని మేక‌ర్స్ ప్లాన్ చేశారు. అయితే ప్ర‌స్తుతం సంక్రాంతికి నెల‌కొన్న పోటీని దృష్టిలో పెట్టుకుని సోలోగా రావ‌డ‌మే బెట‌ర్ అని భావించిన మేక‌ర్స్ `ఏజెంట్‌` సంక్రాంతి రిలీజ్ విష‌యంలో వెన‌క్కి త‌గ్గుతున్న‌ట్టుగా వార్త‌లు వినిపిస్తున్నాయి.  

సంక్రాంతి రేసులో సీనియ‌ర్ హీరోలు మెగాస్టార్ చిరంజీవి `వాల్తేరు వీర‌య్య‌`తో, నంద‌మూరి బాల‌కృష్ణ `వీర సింహారెడ్డి`తో బ‌రిలో దిగ‌బోతున్నారు. ఈ రెండు మాస్ బొమ్మ‌ల మ‌ధ్య దిగడం రిస్క్ అని భావించిన `ఏజెంట్` టీమ్ త‌మ సినిమాని మ‌హా శివ‌రాత్రికి రిలీజ్ చేయాల‌నుకుంటున్నార‌ట‌. థియేట‌ర్ల విష‌యంలోనూ ఇబ్బంది ఎదుర‌య్యే ప్ర‌మాదం వుందన్న ఆలోచ‌న‌లో భాగంగానే `ఏజెంట్‌` ని సంక్రాంతి రేస్ నుంచి త‌ప్పించాల‌ని ఆలోచిస్తున్నార‌ట‌.

 చిరంజీవి `వాల్తేరు వీర‌య్య‌`, నంద‌మూరి బాల‌కృష్ణ `వీర సింహారెడ్డి`తో పాటు సంక్రాంతి రేసులో త‌మిళ డ‌బ్బింగ్ సినిమాలు కూడా పోటీకి దిగుతున్నాయి. విజ‌య్ హీరోగా న‌టిస్తున్న `వార‌సుడు`, అజిత్ న‌టిస్తున్న `తునీవు` రిలీజ్ కాబోతున్నాయి. దీంతో చాలా వ‌ర‌కు సినిమ‌యాల‌కు థియేట‌ర్ల స‌మ‌స్య త‌లెత్తే అవ‌కాశం వుంది. ఆ కార‌ణంగానే `ఏజెంట్‌` ని సంక్రాంతి రేస్ నుంచి త‌ప్పించాల‌నుకుంటున్నార‌ట‌. ఇది మంచి నిర్ణ‌య‌మేన‌ని ఇండ‌స్ట్రీ వ‌ర్గాల్లో వినిపిస్తోంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    
  • Tollywood 
  • younghero 
  • akhilakkineni 
  • agent 
  • movie 
  • latestnews 

Similar News

సీనియ‌ర్ న‌టుడు పోగొట్టుకున్న‌ది స‌రే వార‌స‌త్వ‌ ఆస్తుల విలువ‌?

2026-11-09 19:30 GMT

'DNK' ట్రైలర్ టాక్: బెట్టింగులు.. దొంగతనాలతో మౌళి కామెడీ గోల

2026-11-09 19:16 GMT

'పొలిమేర 3' గ్లింప్స్: ​కొమరయ్య తాంత్రికం.. అర్జున్ సర్జా పవర్ఫుల్ ఎంట్రీ

2026-11-09 19:10 GMT

ఏంటిది? బేబి బంప్‌తో స‌మంత ప్ర‌యోగాలు!

2026-11-09 19:04 GMT

సెల‌బ్రేష‌న్‌లో మ‌హేష్-చ‌ర‌ణ్‌ తో ఆ ప్ర‌ముఖుడు ఎవ‌రు?

2026-11-09 19:03 GMT

పిక్‌టాక్‌ : మెగా ఫ్యాన్స్‌కి బెస్ట్‌ దీపావళి గిఫ్ట్‌

2026-11-09 19:02 GMT

పిక్‌టాక్‌ : స్టైలిష్ అందాల పలక్‌

2026-11-09 19:01 GMT

అలీ భార్య జుబేదా బేగం సోషల్ మీడియా సంపాదన ఎంతో తెలుసా?

2026-11-09 13:30 GMT

డమ్మీ థియేటర్లు.. బల్క్ బుకింగ్స్

2026-11-09 12:56 GMT

కారాల కళ్ళ పిల్లకు ఆది సైట్.. 'ఈగో రాజా' రౌడీ రాకసి

2026-11-09 12:51 GMT

21 ఏళ్ల‌కే వంద సినిమాల‌తో సంచ‌ల‌నం!

2026-11-09 12:30 GMT

ఆయనలో మా నాన్నను చూసుకుంటున్నాను.. తమన్ ఎమోషనల్ కామెంట్స్!

2026-11-09 11:30 GMT

Copyright @2026

Powered by Blink CMS