#బ‌యోపిక్.. అఖిల్ ఆస‌క్తి ఆ క్రికెట‌ర్ జీవితంపై..!

Update: 2021-10-13 06:34 GMT
అక్కినేని అఖిల్ న‌టించిన నాలుగో చిత్రం `మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్` అక్టోబ‌ర్ 15న విడుద‌ల‌వుతున్న సంగ‌తి తెలిసిందే. అక్కినేని అభిమానులు ద‌స‌రా హిట్ కోసం ఎంతో ఉత్కంఠ‌గా వేచి చూస్తున్నారు. అఖిల్ న‌టించిన తొలి మూడు సినిమాలు ఆశించిన విజ‌యం సాధించ‌ని సంగ‌తి తెలిసిందే. అందుకే ఈసారి ఎట్టి ప‌రిస్థితిలో విజ‌యం సాధించాల‌నే క‌సితో అఖిల్ పని చేశారు. ఈ చిత్రంలో పూజా హెగ్డే క‌థానాయిక‌. ద‌ర్శ‌కుడు బొమ్మ‌రిల్లు భాస్క‌ర్ స‌రైన బ్రేక్ ద‌క్కుతుంద‌నే హోప్ తో ఉన్నారు. ప్ర‌స్తుతం ప్ర‌చార కార్య‌క్ర‌మాల్లో టీమ్ చురుగ్గా ప‌ని చేస్తోంది.

తాజా ఇంట‌ర్వ్యూలో అఖిల్ వెల్ల‌డించిన ఓ విష‌యం అక్కినేని అభిమానుల్ని ఎగ్జ‌యిట్ చేస్తోంది. తాను టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ బయోపిక్ లో న‌టించాల‌నుకుంటున్నాన‌ని అఖిల్ వెల్ల‌డించారు. అఖిల్ స్వ‌త‌హాగానే శిక్ష‌ణ పొందిన క్రికెట‌ర్. సెల‌బ్రిటీ క్రికెట్ లీగ్ లో స‌త్తా చాటాడు. తాను ప‌ర్ఫెక్ట్ స్పోర్ట్ ప‌ర్స‌నాలిటీ అని నిరూపించేందుకే విరాట్ బ‌యోపిక్ లో న‌టిస్తాన‌ని అభిప్రాయ‌ప‌డ్డాడు. త‌న‌కు కోహ్లీ అంటే చాలా ఇష్టం. అత‌డి ఆట‌ను తొలి నుంచి ప‌రిశీలిస్తున్నాన‌ని .. త‌న జీవితంలో పైకి క‌నిపించ‌ని భ‌డ‌భాగ్ని ఉంద‌ని కూడా అఖిల్ అన్నారు.

స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో సరైన స్క్రిప్ట్ కోసం ఎదురు చూస్తున్నాను. అది నేను స్పోర్ట్స్‌మ్యాన్ అని అందరినీ ఒప్పిస్తుందని అఖిల్ న‌మ్మ‌కాన్ని వ్య‌క్తం చేశాడు. సినిమా బ‌లంగా ఉండాలంటే.. స్పోర్ట్స్ బయోపిక్ లకు బలమైన కంటెంట్ అవ‌స‌ర‌మ‌ని ..కథ బాగుంటే తప్ప క్రీడ తెర‌పై హైలైట్ కాద‌ని కూడా అఖిల్ అన్నారు. బ‌యోపిక్ నా డ్రీమ్ ప్రాజెక్ట్ కావాలి. విరాట్ కోహ్లీ జీవితం అభిరుచి.. అంకితభావంతో నిండి ఉంది. అత‌డిలో అగ్ని ఉంది. అతను నన్ను చాలా విధాలుగా ప్రభావితం చేశాడు. ఏదో ఒకరోజు అతనిపై కథ రాస్తే చాలా బాగుంటుంది. అందులో నేను న‌టిస్తాను! అని అఖిల్ అన్నారు. ప్ర‌స్తుతం తాను రణ్ వీర్ సింగ్ న‌టించిన క్రీడా బ‌యోపిక్ 83 విడుదల కోసం ఎదురుచూస్తున్నాన‌ని తెలిపాడు. 1983 వరల్డ్ కప్ లో టీమిండియా విజయం చుట్టూ కపిల్ దేవ్ బయోపిక్ తిరుగుతుంది .. అందుకే ఈ మూవీని చూసేందుకు ఆస‌క్తిగా ఉన్నాన‌ని అఖిల్ వెల్ల‌డించారు.
Tags:    

Similar News