• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  'రొమాంటిక్' పోస్టర్ తో...

'రొమాంటిక్' పోస్టర్ తో పూరీ తనయుడి సరికొత్త అప్డేట్

By - Tupaki Desk
Update: 2021-09-04 12:01 GMT
స్టార్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తనయుడు ఆకాష్ హీరోగా నటించిన చిత్రం ''రొమాంటిక్''. డెబ్యూ మూవీ 'మెహబూబా' ఆశించిన స్థాయిలో ఆకట్టుకోకపోవడంతో.. ఈ సినిమాపై ఆశలు పెట్టుకున్నారు. ఈ యూత్ ఫుల్ రొమాంటిక్ ఎంటర్టైనర్ కి పూరీ స్టోరీ - స్క్రీన్‌ ప్లే - డైలాగ్స్ అందించారు. పూరీ శిష్యుడు అనిల్ పాదూరి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. అప్పుడెప్పుడో పూర్తైన ఈ సినిమాని జూన్ 18న విడుదల చేయాలని అనుకున్నారు. అయితే కరోనా సెకండ్ వేవ్ ప్రభావం వల్ల వాయిదా వేశారు. దీంతో ఈచిత్రాన్ని డైరెక్ట్ ఓటీటీలో రిలీజ్ చేస్తారంటూ రూమర్స్ వచ్చాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమా విడుదల గురించి మేకర్స్ క్లారిటీ ఇచ్చారు.

"రొమాంటిక్" చిత్రాన్ని థియేటర్లలోనే రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. అంతేకాదు ఈ సినిమాకు సంబంధించిన సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తయినట్లు వెల్లడించారు. సెన్సార్ బోర్డ్ ఈ చిత్రానికి 'యూ/ఏ' (U/A) సర్టిఫికేట్ జారీ చేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా హీరోహీరోయిన్ల ఇంటెన్స్ రొమాంటిక్ పోస్టర్ ని చిత్ర యూనిట్ విడుదల చేసారు. త్వరలోనే ఈ సినిమా రిలీజ్ డేట్ ని ప్రకటించనున్నారు. ఈ చిత్రంలో ఆకాష్ పూరీ సరసన బాలీవుడ్ హాట్ బ్యూటీ కేతికా శ‌ర్మ హీరోయిన్ గా నటిస్తోంది. ఇది ఆమెకు తెలుగు డెబ్యూ మూవీ. ఆకాష్ - కేతికా ల రొమాంటిక్ ఫీవర్ థియేటర్లలో ఎలాంటి ఫైర్ క్రియేట్ చేస్తుందో చూడాలి.

'రొమాంటిక్' చిత్రంలో సీనియర్ నటి రమ్యకృష్ణ కీలక పాత్ర పోషించారు. మకరంద్ దేశ్ పాండే - ఉత్తేజ్ - సునయన ఇతర పాత్రల్లో కనిపించనున్నారు. సునీల్ కశ్యప్ ఈ చిత్రానికి సంగీతం సమకూర్చారు. నరేష్ సినిమాటోగ్రఫీ అందించగా.. జునైద్ సిద్దిఖీ ఎడిటింగ్ వర్క్ చేశారు. లావణ్య సమర్పణలో పూరీ జగన్నాథ్ టూరింగ్ టాకీస్ మరియు పూరీ కనెక్ట్స్ బ్యానర్స్ పై పూరీ జగన్నాథ్ - చార్మీ కౌర్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.


Tags:    
  • Akash Puri 
  • Romantic 
  • Completes 
  • Censor 
  • U/A 
  • Movie news 

Similar News

వారణాసి మహేష్ బాబు రాముడిగా ఎంత సేపు కనిపిస్తాడు...

2026-11-05 16:32 GMT

స్టెప్-మదర్ కాదు అంతకుమించి!

2026-11-05 16:30 GMT

అంగరంగ వైభవంగా సాయి దుర్గ తేజ్, కిరణ్ నిశ్చితార్థం.. అమ్మాయి వివరాలు ఇవే!

2026-11-05 16:16 GMT

రెడ్ అవుట్‌ఫిట్‌లో స్టన్నింగ్ లుక్‌తో మెరిసిన పాలక్!

2026-11-05 16:16 GMT

'రామాయణ' సెట్స్‌లో సీతగా సాయి పల్లవి.. BTS ఫొటోలు వైరల్!

2026-11-05 16:15 GMT

RC17: హీరో.. హీరోయిన్..విలన్.. ఎవరెవరంటే..!

2026-11-05 16:15 GMT

హై బడ్జెట్ ఫిల్మ్‌లో దళపతి విజయ్.. గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వంలో!

2026-11-05 16:12 GMT

అనిల్ రావిపూడి.. ఈసారి యాక్షన్ కూడా గట్టిగానే..

2026-11-05 16:12 GMT

ఒకప్పుడు ఏలిన టాప్-5 హీరోయిన్‌లు నేడు ఊహించ‌ని స్థితిలో!

2026-11-05 15:30 GMT

డస్టీ రోజ్ శారీలో షాలిని అందాల సందడి!

2026-11-05 14:30 GMT

కమల్ హాసన్ బ్యానర్‌లో రజనీకాంత్-శ్రీలీల!

2026-11-05 13:30 GMT

ఆ పాన్ ఇండియా విషయంలో మాత్రం తెలుగు వాళ్ళ కన్నా తమిళ వాళ్లే మిన్న..!

2026-11-05 12:30 GMT

Copyright @2026

Powered by Blink CMS