ఇరవై ఏళ్లలో మర్చిపోలేని చేదు సంఘటన అది..!

Update: 2023-06-03 05:00 GMT
రెండు దశాబ్దాల క్రితం సినిమాల్లో సైడ్ రోల్స్ వేస్తూ వచ్చిన అజయ్ ఆ తర్వాత విలన్ గా మారి ప్రేక్షకులను మెప్పించాడు. ఈమధ్య సపోర్టింగ్ రోల్స్, స్పెషల్ రోల్స్ చేస్తూ వస్తున్నాడు. రెండు దశాబ్దాల తన కెరీర్ లో అడపాదడపా సోలో ప్రయత్నాలు కూడా చేస్తూ వచ్చాడు అజయ్.

లేటెస్ట్ గా అతను లీడ్ రోల్ లో ఒక సినిమా వచ్చింది. మధుసూదన్ దర్శకత్వంలో చక్రవ్యూహం సినిమా చేశారు అజయ్. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా తన కెరీర్ లో జరిగిన ఒక చేదు సంఘటన గురించి చెప్పుకొచ్చారు.

ఒక సినిమా సెట్లో అందరి ముందు ఒక నటి తనపై కేకలు వేసిందని ఆయన చెప్పారు. ఆ టైం లో తనకు చాలా ఇబ్బందికరంగా అనిపించిందని అన్నారు. ఇంతకీ అజయ్ అలా ఫీలైంది ఎవరి సినిమాలో అంటే శ్రీహరి సినిమా అని తెలుస్తుంది.

డైరెక్టర్ విజయన్ డైరెక్షన్ లో శ్రీహరి హీరోయిన్ గా నటించిన సినిమాలో తానొక నెగిటివ్ రోల్ చేశానని ఆ సినిమా సెట్ లోకి అడుగు పెట్టగానే రేప్ సీన్ అని చెప్పారు. ఆ సీన్ చేస్తున్నప్పుడు ఆ ఉత్తరాది నటి డోంట్ టచ్ అని కేకలు వేసింది. రేప్ సీన్ అని ఆమెకు చెప్పారో లేదో కానీ ఆ క్షణం తనకు చాలా ఇబ్బందిగా అనిపించిందని అనారు అజయ్.

తన కెరీర్ లో ఎదుర్కొన్న ఒక చేదు సంఘటన అంటే అదే అని అజయ్ అన్నారు. ఆ తర్వాత డైరెక్టర్ సీన్ మొత్తాన్ని రీ రైట్ చేశారని అన్నారు. ఆ షాక్ తో ఇక ఆ తర్వాత ఎప్పుడూ తను అలాంటి సీన్ లో నటించలేదని అన్నారు అజయ్. విక్రమార్కుడు సినిమాలో విలన్ గా నటించి ప్రేక్షకులను మెప్పించిన అజయ్ కొన్ని సినిమాల్లో కామెడీ రోల్స్ చేసి కూడా మెప్పించారు.

ప్రస్తుతం వచ్చిన ప్రతి అవకాశాన్ని కాదనకుండా చేస్తున్న అజయ్ చక్రవ్యూహం సినిమాలో మెయిన్ లీడ్ గా చేశారు. సస్పెన్స్, క్రైం థ్రిల్లర్ గా వచ్చిన చక్రవ్యూహం సినిమాలో అజయ్ పోలీస్ పాత్రలో నటించారు.

ఈ సినిమాకు అజయ్ ప్రమోషన్స్ సినిమాను ప్రేక్షకుల్లోకి తీసుకెళ్లేలా చేస్తున్నాయి. స్టార్ హీరోల సినిమాల్లో సైడ్ రోల్స్ తో మొదలైన తన కెరీర్ రెండు దశాబ్దాలుగా సక్సెస్ ఫుల్ గా కొనసాగిస్తున్నాడు అజయ్. తన దాకా వచ్చిన ఏ ఛాన్స్ కూడా వదలకుండా చేస్తూ వస్తున్న అజయ్ కి ఇలాంటి అవకాశాలు మరెన్నో రావాలని ఆశిస్తున్నారు ప్రేక్షకులు.

Similar News