• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  జక్కన్న సినిమాలో గెస్ట్...

జక్కన్న సినిమాలో గెస్ట్ రోల్.. పైసా తీసుకోలేదట

By - Tupaki Desk
Update: 2020-02-08 16:30 GMT
బాహుబలి తర్వాత దర్శకుడు రాజమౌళి క్రేజ్ ఎంతలా పెరిగిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన సినిమా మీద టాలీవుడ్ కు మాత్రమే కాదు.. బాలీవుడ్ మొదలుకొని అన్ని వుడ్ లు ప్రత్యేక ఆసక్తిని ప్రదర్శిస్తున్నాయి. దీనికి తగ్గట్లే ఆయన తాజా మూవీ #RRR అదిరి పోయే కాంబినేషన్లో తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. తన సినిమాలో ప్రతి సన్నివేశాన్ని శిల్పం చెక్కినట్లు చెక్కే జక్కన్న.. తాజా చిత్రం లో మరింత జాగ్రత్త గా ఉన్నాడట.

బహుబలి తర్వాత వస్తున్న సినిమా కావటం.. చిన్న ఎన్టీఆర్.. రాంచరణ్ కలిసి నటిస్తున్న ఈ చిత్రంలో హాలీవుడ్ నటి ఒలీవియా మోరిస్.. అలియా భట్ తో పాటు భారీ స్టార్ కాస్ట్ నటిస్తోంది. ఈ సినిమాలో అతిధి పాత్ర కోసం బాలీవుడ్ హీరో అజయ్ దేవగణ్ చిన్న రోల్ చేశాడు. దీనికి సంబంధించిన షూటింగ్ ను ఇటీవల వికారాబాద్ అడవుల్లో చేసినట్లు తెలుస్తోంది.

అజయ్ షూటింగ్ అయ్యాక.. ఆయనకు పారితోషికంగా చిత్ర నిర్మాత కొంత మొత్తాన్ని ఆఫర్ చేయగా.. ఆయన సున్నితంగా రిజెక్టు చేయటం ఆసక్తికరంగా మారింది. రాజమౌళితో స్నేహం కారణంగానే ఈ సినిమాలో నటించానే తప్పించి.. మరింకేమీ లేదని చెబుతూ జక్కన్న కోసం ఫ్రీగా చేసినట్లు చెప్పారట. బాలీవుడ్ లో మంచి మార్కెట్ ఉన్న ప్రముఖ హీరో.. జక్కన్న అడిగినంతనే చిన్న పాత్రకు ఓకే చెప్పటమే కాదు.. చివరకు పైసా తీసుకోకుండా పని చేయటం చిత్ర పరిశ్రమ లో హాట్ టాపిక్ గా మారింది.
Tags:    
  • Ajay Devgn refuses remuneration for SS Rajamouli RRR 
  • RRR 
  • SS Rajamouli 
  • Tollywood 
  • Tollywood Movie Updates 
  • Telugu Movie News 
  • Tupaki News 
  • Tupaki Updates 

Similar News

దీపావ‌ళి లుక్‌తో క‌ట్టి ప‌డేసిన న‌టి కం గాయ‌ని

2026-11-09 22:30 GMT

సీనియ‌ర్ న‌టుడు పోగొట్టుకున్న‌ది స‌రే వార‌స‌త్వ‌ ఆస్తుల విలువ‌?

2026-11-09 19:30 GMT

'DNK' ట్రైలర్ టాక్: బెట్టింగులు.. దొంగతనాలతో మౌళి కామెడీ గోల

2026-11-09 19:16 GMT

'పొలిమేర 3' గ్లింప్స్: ​కొమరయ్య తాంత్రికం.. అర్జున్ సర్జా పవర్ఫుల్ ఎంట్రీ

2026-11-09 19:10 GMT

ఏంటిది? బేబి బంప్‌తో స‌మంత ప్ర‌యోగాలు!

2026-11-09 19:04 GMT

సెల‌బ్రేష‌న్‌లో మ‌హేష్-చ‌ర‌ణ్‌ తో ఆ ప్ర‌ముఖుడు ఎవ‌రు?

2026-11-09 19:03 GMT

పిక్‌టాక్‌ : మెగా ఫ్యాన్స్‌కి బెస్ట్‌ దీపావళి గిఫ్ట్‌

2026-11-09 19:02 GMT

పిక్‌టాక్‌ : స్టైలిష్ అందాల పలక్‌

2026-11-09 19:01 GMT

అలీ భార్య జుబేదా బేగం సోషల్ మీడియా సంపాదన ఎంతో తెలుసా?

2026-11-09 13:30 GMT

డమ్మీ థియేటర్లు.. బల్క్ బుకింగ్స్

2026-11-09 12:56 GMT

కారాల కళ్ళ పిల్లకు ఆది సైట్.. 'ఈగో రాజా' రౌడీ రాకసి

2026-11-09 12:51 GMT

21 ఏళ్ల‌కే వంద సినిమాల‌తో సంచ‌ల‌నం!

2026-11-09 12:30 GMT

Copyright @2026

Powered by Blink CMS