• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  యాపిల్ బాక్స్ మీద...

యాపిల్ బాక్స్ మీద నుంచుంటే..

By - Tupaki Desk
Update: 2016-03-23 09:30 GMT
ఐశ్వర్యా ధనుష్.. ఈమె సూపర్ స్టార్ రజినీకాంత్ కూతురు. సౌత్ తో పాటు నార్త్ లోనూ క్రేజ్ సంపాదించుకున్న హీరో ధనుష్ కి భార్య. అంతే కాదు తానే  స్వయంగా ఓ డైరెక్టర్. ఇన్ని లక్షణాలు ఉన్న ఈమె ప్రస్తుతం ఓ పుస్తకం రాస్తోంది. తను రాస్తున్న బుక్ ని తండ్రి పుట్టిన రోజైన డిసెంబర్ 12న విడుదల చేసేందుకు సిద్ధమవుతోంది ఐశ్యర్య.

'స్టాండింగ్ ఆన్ యాన్ యాపిల్ బాక్స్'.. ఇదీ ఆ పుస్తకం టైటిల్, దీనిలో అన్నీ తనకు సంబంధించిన విషయాలే ఉంటాయని చెబుతోంది ఐశ్వర్య. 'సెలబ్రిటీల పిల్లల జీవితాలు తమకంటే ఉన్నతంగా గొప్పగా భోగభాగ్యాలతో ఉంటాయని అందరూ అనుకుంటారు. కానీ అందులో వాస్తవం ఏ మాత్రం ఉండదు. మేం కూడా సాధారణంగానే జీవనం సాగిస్తాం. ఆవిషయాలనే పుస్తకంలో వివరించే ప్రయత్నం చేస్తున్నా'అంటోంది ఐశ్వర్య. అయితే ఇదేమీ తన ఆటో బయోగ్రఫీ కాదని..అలాగని కల్పితం కూడా కాదన్న ఐశ్వర్య.

సెమీ ఆటోబయోగ్రఫీ అనుకోవచ్చని చెప్పింది. తనకు ఈ పుస్తకం చాలా ముఖ్యమని.. రైటర్ గా మారేందుకు సినిమాలను కూడా వదిలేసి ఇటువైపే దృష్టి పెట్టానని ఆమె అంటోంది. తన చిన్న నాటి జీవితం - పేరెంట్స్ అనుబంధం - ఇంట్లో ఉండే తీరు - పెళ్లి నాటి పరిస్థితులు.. ఇలా తన జీవితానికి సంబంధించిన కొన్ని సంఘటనలను కథల రూపంలో అందించే ప్రయత్నం చేశానని చెప్పింది ఐశ్వర్యా ధనుష్.
Tags:    
  • Aishwarya Dhanush 
  • Standing On An Apple Box 
  • Telugu NEws 

Similar News

Tollywood: చిన్న తప్పు కూడా పెద్ద ముప్పే!

2026-11-04 22:30 GMT

చిరంజీవి, బాలయ్య, వెంకటేష్, నాగార్జున కాంబోలో మూవీ రాబోతోందా?

2026-11-04 19:30 GMT

'ఆపరేషన్ సింధూర్'పై రేసింగ్: 10 సినిమాలు ప్ర‌క‌టించారు కానీ..!

2026-11-04 18:30 GMT

తమిళ ఇండస్ట్రీ కన్నా తెలుగు ఇండస్ట్రీలోనే గౌరవం..!

2026-11-04 18:03 GMT

Bigg Boss Telugu 10: తొమ్మిదో వారం డేంజర్ జోన్‌లో ఆ ఐదుగురు!

2026-11-04 18:02 GMT

Bigg Boss Telugu 10: 'రివార్డ్ అండ్ రివెంజ్' లో అదిరిపోయే ట్విస్ట్స్

2026-11-04 18:02 GMT

ఎన్నో మల్టీస్టారర్లలో.. ఈ రాబోయే తెలుగు మల్టీస్టారర్ మిన్న!

2026-11-04 18:01 GMT

అఖిల్ అక్కినేని క్రష్ ఎవరో తెలుసా..?

2026-11-04 18:01 GMT

మినీ కొట్టు పెట్టిన జగపతిబాబు కూతురు.. వీడియో వైరల్!

2026-11-04 17:53 GMT

తెలుగు ఇండస్ట్రీపై పాయల్ రాజ్‌పుత్ ప్రేమ.. అదుర్స్!

2026-11-04 17:52 GMT

AK 47 : ఆ కఠినమైన పని చేయడం అంత సులువు కాదు గురూజీ..!

2026-11-04 17:44 GMT

రాజమౌళి వచ్చాక ఇంటర్వెల్ సీన్స్ మారిపోయాయా? ఇంతకీ ఆయన ఏం చేశాడు...

2026-11-04 17:30 GMT

Copyright @2026

Powered by Blink CMS