ఐష్ చాకొలేట్ చప్పరిస్తున్న రణబీర్

Update: 2016-05-24 05:14 GMT

అమ్మాయి - అబ్బాయి ఒకే చాకొలేట్ ని చప్పరిస్తున్నట్లు చూపించడం ఈ మధ్య చాకొలేట్ కంపెనీల యాడ్స్ లో కనిపిస్తోంది. దీన్ని ఆల్మోస్ట్ లిప్ లాక్ తో సమానమైన రొమాంటిక్ సీన్ అన్నట్లుగా ప్రొజెక్ట్ చేస్తున్నాయి కంపెనీలు. అదే ఒకరి శరీరంపై పడ్డ చాకొలేట్ ని మరొకళ్లు చప్పరించినట్లు చూపిస్తే? అది కూడా రణబీర్ కపూర్, ఐశ్వర్యారాయ్ లాంటి జంట ఆ సీన్ చేస్తే ఎలా ఉంటుంది?

కరన్ జోహార్ నెక్ట్స్ మూవీలో ఇలాంటి సీన్ ఒకటి ప్లాన్ చేశారని తెలుస్తోంది. రణబీర్ కపూర్, ఐశ్వర్యారాయ్, అనుష్క శర్మలు హీరో హీరోయిన్లుగా 'ఆయే దిల్ హై ముష్కిల్' అనే మూవీని తీస్తున్నాడు కరణ్ జోహార్. ఈ సినిమాలో రణబీర్ తో ఐశ్వర్యారాయ్ కి ఓ లిప్ లాక్ సన్నివేశం తీయాల్సి ఉంది. అయితే.. కుర్ర హీరో అనో.. ప్రస్తుతం తన స్థాయిని బట్టి అనో.. మూతి ముద్దు సీన్ విషయంలో ఐశ్వర్య  అభ్యంతరం చెప్పిందట.

ఐష్ నుంచి అబ్జెక్షన్ రావడంతో.. లిప్ లాక్ సీన్ ను.. చాకొలేట్ సీన్ గా మార్చేశాడట కరణ్ జోహార్. ఐష్ బాడీ పై చాకొలేట్ ఉంటే.. తన నాలుకతో రణబీర్ నాకేస్తాడన్న మాట. మరి ఐశ్వర్య బాడీలో ఏ పార్ట్ పై చాకొలేట్ చిలకరించారో మాత్రం డీటైల్స్ బైటకు ఇవ్వలేదు. ఇలాంటివన్నీ ముందే చెప్పేస్తే ఎలా.. ఆన్ స్క్రీన్ పై చూసుకోండి అంటోంది ఆయే దిల్ హై ముష్కిల్ యూనిట్.
Tags:    

Similar News