ప్రభాస్ 20లో సెన్సేషనల్ సెలబ్రెటీ!

Update: 2020-07-09 11:30 GMT
ప్రభాస్ ఫాన్స్ ఎదురు చూపులకు తెరపడబోతున్న సమయం అసన్నం అయ్యింది. రేపు ప్రభాస్ సినిమా ఫస్ట్ లుక్ విడుదల కాబోతుంది. ఇప్పటికే యూవీ క్రియేషన్స్ వారినుండి అధికారికంగా ప్రకటన వచ్చింది. ఇదే సమయంలో సినిమా గురించి మీడియాలో పలు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ సినిమాలో నటించబోతున్న ఒక నటి గురించి ప్రస్తుతం జాతీయ స్థాయి మీడియాలో చర్చ జరుగుతోంది.

ఎయిర్ టెల్ యాడ్స్ తో జాతీయ స్థాయిలో గుర్తింపు దక్కించుకున్న మోడల్ సశ చేత్రి. ఈమె ను చాలా రోజుల క్రితమే టాలీవుడ్ లో ఇంకా కోలీవుడ్ లో కూడా నటింపజేసేందుకు ప్రయత్నాలు చేశారు. కానీ ఆమె మాత్రం పెద్దగా ఆసక్తి చూపలేదు. తాజాగా ప్రభాస్ మూవీలో నటించేందుకు ఒప్పుకుందట. ఈ సినిమాలో కీలకమైన ప్రభాస్ చెల్లి పాత్రను ఆమెతో చేయించబోతున్నారట.

ఈ విషయం పై త్వరలో అధికారిక క్లారిటీ వస్తుందని అంటున్నారు. ఇప్పుడు కాకున్నా కూడా సినిమా విడుదల సమయం వరకు క్లారిటీ వచ్చే అవకాశం ఉంది అంటున్నారు. సశ సౌత్ లో నటించబోతున్న మొదటి సినిమా ఇదే. నేషనల్ సెలబ్రెటీ స్థాయి కలిగిన సశ ఖచితంగా ప్రభాస్ 20 సినిమాకు అదనపు ఆకర్షణగా నిలుస్తుందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
Tags:    

Similar News