అజ్ఞాతవాసి టీజర్ సాంగ్.. ఇప్పటిది కాదు

Update: 2017-12-17 08:15 GMT
నిన్న సాయంత్రం రిలీజైన ‘అజ్ఞాతవాసి’ టీజర్ పవన్ కళ్యాణ్ అభిమానుల్ని విశేషంగా ఆకట్టుకుంది. ఈ టీజర్ చాలా వరకు ‘అత్తారింటికి దారేది’ సినిమాను గుర్తుకు తెచ్చింది. అందులో దేవ దేవం భజే.. అంటూ ఒక కీర్తనను చాలా చక్కగా వాడుకున్నట్లే ఈ సినిమాలోనూ ఒక పాత కాలం నాటి కీర్తనను అందంగా ట్యూన్ చేశారు. టీజర్ బ్యాగ్రౌండ్లో ఆ పాటే వినిపించింది. ‘‘మధురాపురి సదనా మృదు వదనా.. మధుసూదనా ఇహ.. స్వాగతం కృష్ణా శరణాగతం కృష్ణా ధీర ముని జన విహార మదన సుకుమార దైత్య సంహార దేవా మధుర మధుర రతి సాహస సాహస వ్రజ యువతి జన మానస పూజిత’’ అంటూ సాగుతుందీ కీర్త.

ఇది 300 ఏళ్ల కిందటి కీర్తన కావడం విశేషం. వేంకటేశ్వరస్వామి భక్తుడైన తమిళ కవి ఊతుక్కాడ వేంకట కవి కీర్తనను రాయడం విశేషం. దాన్ని సంగీత దర్శకుడు అనిరుధ్ చాలా అందంగా ట్యూన్ చేసి మెప్పించాడు. దీని గానం కూడా చాలా బాగా సాగింది. ఇంత మంచి కీర్తనను తీసుకొచ్చినందుకు త్రివిక్రమ్ మీద సాహిత్యాభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు. మరి ఈ పాటను సినిమాలో ఎలా వాడుకున్నారో చూడాలి. ‘అజ్ఞాతవాసి’ ఫుల్ ఆడియో ఈ నెల 19న విడుదల కాబోతోంది. ఈ చిత్రాన్ని జనవరి 10న ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల చేయబోతున్నారు. ‘జల్సా’.. ‘అత్తారింటికి దారేది’ తర్వాత పవన్-త్రివిక్రమ్ కాంబినేషన్లో తెరకెక్కిన ఈ చిత్రంపై అంచనాలు మామూలుగా లేవు.
Tags:    

Similar News