• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  మరో పాన్ ఇండియాకు పూరీ కథ...

మరో పాన్ ఇండియాకు పూరీ కథ సిద్ధం!

By - Tupaki Desk
Update: 2020-05-20 03:45 GMT
కరోనా వైరస్ తెలుగు సినీ ఇండస్ట్రీని భారీ దెబ్బతీసింది. లాక్ డౌన్ విధించిన కేంద్ర ప్రభుత్వం మాటను ఖాతరు చేస్తూ సినీ దర్శక నిర్మాతలు సినిమా షూటింగ్స్ నిలిపేశారు. అలా షూటింగ్ నిలుపుకొని ఇంట్లో ఉన్నవారిలో పూరి జగన్నాధ్ కూడా ఒకరు. ముంబైలో తన ఫైటర్ యొక్క ప్రధాన షెడ్యూల్ పూర్తి చేసి, లాక్ డౌన్ విధించే సమయానికి హైదరాబాద్ చేరుకున్నారు. లాక్ డౌన్ తర్వాత ఫైటర్ షూటింగ్ తిరిగి స్టార్ట్ చేస్తామని కూడా తెలిపారు. పూరీ జగన్నాథ్ తెలివిగా లాక్ డౌన్ టైంని ఫుల్ గా వినియోగించుకున్నాడు. ఇటీవలే ఒక ఇంటర్వ్యూలో పూరి జగన్నాధ్ తన నెక్స్ట్ సినిమా కోసం స్క్రిప్ట్ రాస్తున్నట్లు వెల్లడించాడు. ప్రస్తుతం విజయ్ దేవరకొండ సినిమా షూటింగ్ మాత్రమే మిగిలి ఉండటంతో తదుపరి సినిమాకోసం స్క్రిప్ట్ రాసాడట. అయితే దానికి హీరో ఎవరు అనేది మాత్రం రివీల్ చేయలేదు.

ఆ మధ్య ఫిల్మ్‌నగర్‌లో పూరీ స్క్రిప్ట్ రైటింగ్ గురించి ఒక వార్త హల్చల్ చేసింది. ఇప్పుడు పూరీ జగన్నాథ్ రాసిన స్క్రిప్ట్ మెగాస్టార్ చిరంజీవి కోసమేనని ఫిల్మ్ నగర్ కోడై కూసింది. కానీ పూరీ తదుపరి సినిమా కూడా పాన్ ఇండియా లెవెల్ లో ఉండబోతుందట. ఆ కథ పూర్తిస్థాయిలో  సిద్ధమైందట. ఇటీవల దర్శకులంతా కథలు సిద్ధం చేసుకొని, వాటిని వీడియో కాల్‌ ద్వారా హీరోలకు కథలు వినిపించి ఓకే చేసుకుంటున్నారు. మరి త్వరలోనే పూరి కొత్త సినిమాకి సంబంధించిన ప్రకటన వచ్చే అవకాశం ఉంది. ఇక ఆ సినిమాలో అందులో ఓ స్టార్ హీరో నటించనున్నట్లు సమాచారం. ప్రస్తుతం విజయ్ దేవరకొండతో ఫైటర్ చేస్తుండగా.. ఈ సినిమాలో అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తుంది. ఇక ఈ సినిమాతో అనన్య తెలుగు తెరకి పరిచయం కానుంది. అయితే ఈ సినిమా పూరీ కనెక్ట్స్ అండ్ ధర్మ ప్రొడక్షన్స్ సంయుక్త నిర్మాణంలో రూపొందుతుంది.
Tags:    
  • after vijay film puri going to direct another pan indian film 
  • Puri Connects 
  • Tollywood 
  • Tollywood Latest Movie Updates 
  • Tollywood News 
  • Telugu News 
  • Tupaki News 
  • Tupaki Updates 

Similar News

రణ్‌బీర్‌కి ఇలా, యష్‌కి అలా…రామాయణం మూవీ వెనుక ఇంట్రెస్టింగ్ సీక్రెట్స్..!

2026-11-20 10:20 GMT

బ‌న్నీ రేసులో బోయ‌పాటి నెంబ‌ర్ - 4!

2026-11-20 10:20 GMT

పండంటి మగ బిడ్డకి జన్మనిచ్చిన సమంత.. కొడుకు పేరు ఏమిటంటే?

2026-11-20 09:21 GMT

సౌత్ ఇండ‌స్ట్రీపై రాజ‌మండ్రి బ్యూటీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు!

2026-11-20 09:21 GMT

Allu Aravind Three Stars: చిరు, చరణ్, బన్నీ..!

2026-11-20 08:28 GMT

'ఓం' మూవీ రివ్యూ

2026-11-20 08:27 GMT

తెలిసిన వారినే ప్రశ్నించడానికి ఎందుకు వెనుకాడుతున్నాం?

2026-11-20 08:23 GMT

సూపర్‌స్టార్ పక్కన చిన్నపిల్లలా అందాల రాశీఖ‌న్నా!

2026-11-20 07:38 GMT

తొలుత అర్థం కాలేదు.. తెలిశాక వివరించే ప్రయత్నం చేశా!

2026-11-20 07:36 GMT

మృత్యువు అంచుల నుంచి కాజల్ అగర్వాల్‌కు తప్పిన ప్రమాదం..!

2026-11-20 06:45 GMT

'గాడ్జిల్లా'పై 'రామాయ‌ణం' ఇంపాక్ట్ ఎంత‌?

2026-11-20 06:43 GMT

సొంత థియేటర్‌పై ఫిర్యాదు.. అల్లు అరవింద్ రియాక్షన్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

2026-11-20 06:42 GMT

Copyright @2026

Powered by Blink CMS