చాన్నాళ్ల తర్వాత టాలీవుడ్‌ లో బిజీ అయ్యింది

Update: 2020-10-01 08:30 GMT
కమల్‌ హాసన్‌ కూతురుగా పరిచయం అయినా హీరోయిన్‌ గా తనకంటూ ప్రత్యేక ఇమేజ్‌ ను సొంతం చేసుకుంది. మల్టీ ట్యాలెంటెడ్‌ అయిన శృతి హాసన్‌ టాలీవుడ్‌ లో మొదటి సక్సెస్‌ ను అందుకుంది. అయితే ఆమె టాలీవుడ్‌ కంటే ఎక్కువగా బాలీవుడ్‌ మరియు కోలీవుడ్‌ సినిమాలను చేస్తూ వస్తోంది. ఆమద్య సినిమాలను పక్కకు పెట్టి మ్యూజిక్‌ షో లు చేసిన శృతి హాసన్‌ ప్రస్తుతం సినిమాలపై దృష్టి పెట్టింది. హిందీలో ఈ అమ్మడు చేసిన సినిమా ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక తమిళంలో కూడా ఒక సినిమా చేస్తోంది. అయితే ఈమె తెలుగులో మాత్రం ఏకంగా మూడు ప్రాజెక్ట్‌ లను చేస్తున్నట్లుగా తెలుస్తోంది.

లస్ట్‌ స్టోరీస్‌ వెబ్‌ సిరీస్‌ తెలుగు రీమేక్‌ లో ఈమె కియారా అద్వానీ నటించిన పాత్రను చేయబోతుంది. అందులో ఈమె రానాకు జోడీగా కనిపించబోతుంది. హిందీలో కియారా పోషించిన పాత్ర సెన్షేషనల్‌ అయిన విషయం తెల్సిందే. తెలుగులో కూడా ఆ స్థాయిలో పాత్ర ఉంటుందా అనేది చూడాలి. ప్రస్తుతం రానా మరియు శృతి హాసన్‌ లు నాగ్‌ అశ్విన్‌ ల దర్శకత్వంలో నటిస్తున్నారు. ఈ వెబ్‌ సిరీస్‌ తర్వాత శృతి హాసన్‌ రెండు సినిమాల్లో నటించనుంది. రవితేజతో చేస్తున్న క్రాక్‌ సినిమా షూటింగ్‌ ముగింపు దశకు వచ్చింది.

ఆ సినిమా షూటింగ్‌ ను పూర్తి చేయంతో పాటు పవన్‌ కళ్యాణ్‌ తో మూడవ సారి 'వకీల్‌ సాబ్‌' సినిమా కోసం నటించబోతుంది. ఇప్పటికే గబ్బర్‌ సింగ్‌ మరియు కాటమరాయుడు సినిమాల్లో పవన్‌ తో నటించిన శృతి హాసన్‌ వకీల్‌ సాబ్‌ సినిమాలో గెస్ట్‌ రోల్‌ లో కనిపించబోతుంది. ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్‌ ఈనెల చివర్లో లేదా వచ్చే నెల నుండి పాల్గొనే అవకాశం ఉంది. మొత్తానికి చాలా కాలం తర్వాత టాలీవుడ్‌ లో వరుసగా సినిమాల్లో ఈ అమ్మడు నటిస్తోంది.
Tags:    

Similar News