ఇది క్లిక్కయితే హీరోలే రాసుకుంటారు

Update: 2018-07-05 04:03 GMT
ట్రెండ్ అనేది రెగ్యులర్ గా మారుతూ ఉండటమే ఒక ట్రెండ్. అలా మారినప్పుడే ఎవరికైనా కిక్ ఉంటుంది. ఆర్కూట్ ఉందని కామ్ గా కూర్చుంటే ఫేస్ బుక్ వచ్చేది కాదు.. ఫేస్ బుక్ వచ్చిందని పండగ చేసుకుంటూ ఉంటే ఇన్ స్టాగ్రామ్ దొరికేది కాదు. అలాగే ఇప్పుడు సినిమా కథల విషయంలో కూడా మన హీరోలు అలోచించే పద్దతులు మారుతున్నాయి.

ఆ మధ్యన తనకు ఏ దర్శకుడూ సరైన కథ ఇవ్వట్లేదని.. స్వయంగా హీరో రామ్ కొంతమంది రైటర్లను కూర్చోపెట్టుకుని కథలు వండడం మొదలెట్టాడు. కాని ఇంతలో వేరే సినిమాలకు కమిటయ్యాడులే. ఇప్పుడు అడివి శేష్‌ అయితే.. గతంలో ఎలాగైతే కొన్ని హాలీవుడ్ సినిమాలను చూసి ఇన్ స్పయిర్ అయ్యి క్షణం కథను తయారు చేయించాడో.. ఇప్పుడు తనే స్వయంగా గూఢచారి కథను రాసుకొచ్చాడు. టీజర్ చూస్తే హాలీవుడ్ రేంజ్ హంగులన్నీ మనకు కనిపించేశాయి. ఒకవేళ ఈ కథ క్లిక్కయితే? సినిమా హిట్టయితే?

ఖచ్చితంగా గూఢచారి హిట్టయితే మాత్రం చాలామంది హీరోలు ఇక తామే స్వయంగా రంగంలోకి దిగి తమ కథలను తామే రాసుకున్నా రాసుకోవచ్చు. ఆల్రెడీ హాలీవుడ్లో ఇదే తరహాలో టామ్ క్రూజ్.. బెన్ ఎఫ్లెక్.. వంటి స్టార్ హీరోలు తమ కథలను తామే రాసుకుంటూ ఉంటారు. స్ర్కీన్ రైటర్లతో దగ్గరుండి రాయిస్తుంటారు. చూద్దాం టాలీవుడ్లో ఏం జరుగుతుందో.
Tags:    

Similar News