• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  తిరిగి 'మేజర్' సెట్స్ లో...

తిరిగి 'మేజర్' సెట్స్ లో అడుగుపెట్టిన వర్సటైల్ యాక్టర్..!

By - Tupaki Desk
Update: 2021-10-23 08:30 GMT
యువ హీరో అడవి శేష్ నటిస్తున్న తాజా చిత్రం ''మేజర్''. ముంబై 26/11 ఉగ్రవాద దాడులలో వీరమరణం పొందిన ఎన్ఎస్జి కమాండో మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ స్ఫూర్తిదాయకమైన జీవితం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇప్పటికే మేజర్ షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా చివరి దశలో ఉంది. ఈరోజు శనివారం పెండింగ్ పోర్షన్ చిత్రీకరణ మొదలు పెట్టినట్లు చిత్ర బృందం వెల్లడించింది.

ఈ సందర్భంగా అడివి శేష్ ట్వీట్ చేస్తూ.. ''మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ అనే నా ప్రయాణం దాదాపు పూర్తయింది. ఈ షెడ్యూల్ తర్వాత, నేను అతని ఆరాధకుడిగా తిరిగి వెళ్తాను. అతన్ని బాగా అర్థం చేసుకున్న అభిమానిని. తనలో మేజర్ సందీప్ ని కనుగొనడానికి ప్రయత్నించిన అభిమాని'' అని పేర్కొన్నారు. ఇటీవల అనారోగ్యానికి గురైన శేష్.. చికిత్స తీసుకుని బయటపడ్డారు. ఈ క్రమంలో తిరిగి ''మేజర్'' సెట్స్ లో అడుగుపెట్టారు.

పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతున్న 'మేజర్' చిత్రానికి అడివి శేష్ కథ - స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. 'గూఢచారి' ఫేమ్ శశి కిరణ్ తిక్కా దర్శకత్వం వహిస్తున్నారు. మహేష్ బాబు GMB ఎంటర్టైన్మెంట్ మరియు A+S మూవీస్ సహకారంతో సోనీ పిక్చర్స్ ఫిల్మ్స్ ఇండియా ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. త్వరలోనే ఈ సినిమా విడుదల తేదీని ఖరారు చేయనున్నారు.

'మేజర్' చిత్రంలో తెలుగమ్మాయి శోభితా దూళిపాళ్ల - బాలీవుడ్ బ్యూటీ సైఈ మంజ్రేకర్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ప్రకాష్ రాజ్ - రేవతి - మురళీ శర్మ ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. శ్రీ చరణ్ పాకాల ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు. వంశీ పచ్చిపులుసు సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. అబ్బూరి ఈ చిత్రానికి రవి సంభాషణలు రాస్తున్నారు.
Tags:    
  • Adivisesh 
  • MajorSandeepUnnikrishnan 
  • Goodachari 
  • Kshanam 
  • Goodachari 2 

Similar News

ఈసారైనా పెళ్లి అవుతుందా? సీజన్ 2పై పెరిగిన ఆసక్తి!

2026-11-06 10:30 GMT

భారతీయ కథలకు ప్రపంచమే వేదిక!

2026-11-06 09:30 GMT

రామాయణం లిప్ సింక్.. ఏం మ్యాజిక్ చేశారబ్బా?

2026-11-06 09:19 GMT

శ్రీరాముడు కూడా 14 ఏళ్లే వనవాసం.. నాకు మాత్రం ఎందుకిలా..రేణు దేశాయ్ ఆవేదన..!

2026-11-06 09:18 GMT

ఈర్ష్య కాదు ప్రశంస.. కై పో చే ఫ్రెండ్స్!

2026-11-06 08:30 GMT

'సీన్' మూవీ రివ్యూ

2026-11-06 07:54 GMT

గార్జియస్ లుక్ లో అందరినీ తన వైపు తిప్పుకున్న శ్రీలీల.. ఔట్ఫిట్ తోనే మాయ చేస్తూ!

2026-11-06 07:51 GMT

రాజకీయాల నుంచి వెండితెరకు అసాధారణ ప్రయాణం!

2026-11-06 07:30 GMT

'సమ్మర్ హాలిడేస్' రివ్యూ

2026-11-06 07:23 GMT

ఫ్లాపుల తర్వాత రామ్ మాస్టర్ ప్లాన్.. 2027లో రెండు సినిమాల రిలీజ్‌కు రెడీ!

2026-11-06 06:30 GMT

సూర్యకు మళ్లీ 30 కోట్ల టార్గెట్

2026-11-06 05:49 GMT

కాజల్‌కు ఈ పార్ట్ 2 కష్టాలేంటి!

2026-11-06 05:49 GMT

Copyright @2026

Powered by Blink CMS