కళ్యాణ్‌ రామ్ యారోగెంట్ అనుకున్నా..

Update: 2016-10-05 17:48 GMT
మిస్ ఇండియా గాళ్‌ అదితి ఆర్య ఇప్పుడు తొలిసారిగా తెరపై కనిపించనుంది. అమ్మడు హీరోయిన్ గా ''ఇజం'' సినిమాతో డెబ్యూ చేయనుంది. ఈ సందర్భంగా ఆడియో లాంచులో మాట్లాడిన అదితి.. తన ఇంగ్లీష్ ఫ్లోతో చంపేసింది. పూరి కనెక్ట్స్ వారికి థ్యాంక్యూల మీద థ్యాంక్యూలు చెప్పేసింది. అసలు దర్శకుడు పూరి జగన్ గురించి చెబుతూ.. ''మీ హీరోయిన్లు అందరూ పెద్ద స్టార్లు అయ్యారు పూరి సార్. అలాగే నా విషయంలో కూడా హిస్టరీ రిపీట్ అవుతుంది అనుకుంటున్నా'' అంటోంది అమ్మడు.

ఇక కళ్యాణ్‌ రామ్ గురించి అయితే రెండాకులు ఎక్కువే చెప్పిందిలే. ''కొత్తలో భయపడ్డాడు. ఒక పెద్ద స్టార్ కాబట్టి ఆయన చాలా యారోగెంట్ గా ఉంటారని అనుకున్నా. కాని ప్రతీరోజూ ఆయన ఏ సీన్ ఏంటో చెప్పేవారు. ప్రతీరోజూ చాలా హెల్ప్ చేసేవారు. న్యూ కమ్మర్ కంటే కూడా 10 రెట్లు ఎక్కువగా వర్క్ చేస్తారు కళ్యాణ్‌ రామ్. రోజూ జిమ్ చేస్తారు. డయట్ ఫాలో అవుతారు. ఆయన సూపర్'' అంటూ కళ్యాణ్‌ రామ్ పై ప్రశంసలు గుప్పించింది అదితి ఆర్యా.

కాని ప్రస్తుతానికి పాటల్లో చూసినా.. ఎక్కడ చూసినా కూడా.. అదితి ఆర్య లుక్స్ యావరేజ్ గానే అనిపిస్తున్నాయి అంటున్నారు మూవీ లవర్స్. అమ్మడు తన యాక్టింగ్ టాలెంట్ చూపిస్తేగాని పనవ్వదేమో మరి. వెయిట్ అండ్ సీ.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News