శేష్ భయ్యా వేదాంతం.. తేజు భాయ్ మద్దతు!
వేదాంతం ఎందుకు వస్తుంది అంటే దానికి సవాలక్ష కారాణాలు ఉంటాయి. ప్రేమికుడి హృదయానికి గాయం అయితే వస్తుంది. భార్య రాచి రంపాన పెడితే వస్తుంది. భర్త మరో నంగనాచిని తగులుకుంటే వస్తుంది. రాజకీయ నాయకుడికి పదవి పోతే వస్తుంది. ఇలా ఎన్నో ఎన్నో ఉండొచ్చు.. అయితే మన టాలీవుడ్ హ్యాండ్సమ్ హీరో అడివి శేష్ కు ఎందుకో తెలియదు కానీ తాజాగా ఓ ఫిలాసఫి ధ్వనించే ట్వీటు వదిలాడు.
శేష్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా "రేపటి సుఖం కోసం ఇవాల్టి నిజాన్ని మర్చిపోవద్దు" అంటూ ట్వీటాడు. ఈ అర్థం కాని ట్వీటును మెగా హీరో సాయి ధరమ్ తేజ్ రీ-ట్వీటాడు. ఇక బ్రహ్మాజీ గారు "ఓకే బ్రో.. విల్ ఫాలో దట్" అంటూ రిప్లై ఇచ్చారు. దీంతో శేష్ భయ్యా ఎవరిని ఉద్దేశించి ఈ మాట అన్నాడో అంటూ చర్చలు మొదలయ్యాయి. మరి ఏ కారణంతో శేష్ అలాంటి ట్వీట్ పెట్టాడో ఏమో కానీ కొందరు చెప్తున్న విషయం ఏంటంటే హీరోల్లో చాలామంది వ్యాక్సీన్ లేదా మెడికేషన్ ప్రోటోకాల్ వచ్చేవరకూ షూటింగ్స్ కు హాజరయ్యేందుకు సిద్ధంగా లేరట. వ్యాక్సీన్ లేకపోయినా కనీసం మెడికేషన్ ప్రోటోకాల్ ఉంటే ప్రాణాలకు రక్షణ ఉంటుందని.. లేకపోతే షూటింగ్ లొకేషన్ లో అందరి ప్రాణాలు గాల్లో దీపాల లాగా అవుతాయని అంటున్నారు.
మరి ఇదే ఉద్దేశంతో శేష్ లాంటి ఈ వేదాంతపరమైన ట్వీట్ వేసినట్టా? తేజు కూడా అందుకే శేష్ ను సమర్థించినట్టా? బ్రహ్మాజీ కూడా అందుకే 'అయితే ఓకే' అన్నట్టా? ప్రస్తుతానికైతే క్లారిటీ లేదు కానీ త్వరలోనే ఈ విషయాలపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.