బన్నీతో ఢీ కొడుతున్న బాలకృష్ణ

Update: 2015-10-10 14:39 GMT
బోయపాటి - బన్నీ కాంబినేషన్ లో వస్తున్న మూవీలో.. ఆదర్శ్ బాలకృష్ణ నెగిటివ్ రోల్ చేస్తున్నాడు. మెయిన్ విలన్ తర్వాత.. సెకండ్ లీడ్ విలన్ కేరక్టర్ పోషిస్తున్నాడు ఆదర్శ్. ఈ మూవీలో ఆది పినిశెట్టి మెయిన్ విలన్ గా చేస్తున్న విషయం తెలిసిందే. పదేళ్లుగా ఇండస్ట్రీలో ఉన్నా.. ట్యాలెంటెడ్ ఆర్టిస్ట్ గా పేరు తెచ్చుకున్నా.. ఇప్పటివరకూ ఇతగాడికి సరైన కేరక్టర్ పడలేదు.

తనను తాను ప్రూవ్ చేసుకునేందుకు బోయపాటి శ్రీను సరైన అవకాశం ఇచ్చారంటున్నాడు ఆదర్శ్ బాలకృష్ణ. బోయపాటి సినిమాల్లో విలనిజం ఏ రేంజ్ లో ఉంటుందో అందరికీ తెలిసిన విషయమే. హీరోతో సమానంగా ఢీ కొట్టే కేరక్టర్స్ డిజైన్ చేయడంలో స్పెషలిస్ట్ ఈ డైరెక్టర్.  అలాంటి పవర్ ఫుల్ రోల్ తనకు లభించిందని.. అయితే తన పాత్ర గురించి ఇంతకంటే చెప్పడం కరెక్ట్ కాదంటున్నాడు ఆదర్శ్. సినిమాల గురించి లీక్స్ ఇచ్చి పాపులర్ అవడం తనకు ఇష్టం లేదని చెప్పాడు.

పదేళ్ల క్రితం ఇక్బాల్ తో నెగిటివ్ రోల్ తో ఇండస్ట్రీలో ప్రవేశించడంతో. ఇప్పటికీ అవే తరహా కేరక్టర్స్ వస్తున్నాయని చెప్పాడు ఆదర్శ్. అయితే తన ట్యాలెంట్ ప్రూవ్ చేసుకోవడానికి ఎలాంటి కేరక్టర్స్ అయినా చేస్తానంటున్నాడు.
Tags:    

Similar News