కొడుకు పుట్టాడని చెప్పిన బాలకృష్ణ

Update: 2017-02-23 07:30 GMT
ఆదర్శ్ బాలకృష్ణ.. టాలీవుడ్ సినిమాల్లో నెగిటివ్ కేరక్టర్లతో ఈ ఆర్టిస్ట్ బాగా ఫేమస్. మంచి సినిమాలు.. చెప్పుకోదగ్గ కేరక్టర్లనే చేస్తున్నాడు. ఈ కుర్రాడు గతేడాది గుల్నర్ అనే యువతిని వివాహమాడాడు. ఢిల్లీకి చెందిన ఆంట్రప్రెన్యూర్ ఈ గుల్నర్.

ఇప్పుడీ జంటకు ఓ చక్కని మగబిడ్డ పుట్టాడు. ఆ విషయాన్ని అధికారికంగా ప్రకటించాడు ఆదర్శ్ బాలకృష్ణ. 'నిర్వాణ్ ఆదర్శ్ కృష్ణ.. 20 ఫిబ్రవరి 2017.. మధ్యాహ్నం 1.46..  గుల్నర్ విర్క్ కృష్ణ.. నువ్వు కచ్చితంగా ఓ లెజెండ్. దిగంతాల వరకూ పెద్ద కేకలతో చాటి చెబుతున్నా' అంటూ తమకు పుట్టిన విషయాన్ని అనౌన్స్ చేశాడు ఆదర్శ్ బాలకృష్ణ. ఈ విషయాన్ని తాజాగా చెప్పిన ఈ యాక్టర్.. ముందు రోజే చిన్న పాటి హింట్ ఇచ్చాడు. తన పోస్ట్ లో కేవలం.. 'ఇవాళే' అంటూ రాయడంతో అందరిలోనూ ఆసక్తి చెలరేగింది.

ఆదర్శ్ దేని గురించి మాట్లాడుతున్నాడో అనే సస్పెన్స్ క్రియేట్ అయింది. సన్నిహితులకు ఈ విషయం ముందే తెలిసిపోవడంతో.. బోలెడన్ని అభినందనలు.. బెస్ట్ విషెస్ చెప్పేశారు స్నేహితులు. రెండు రోజుల ముందు నుంచే ఈ విషెస్ వర్షంలో తడిసిన ఆదర్శ్ బాలకృష్ణ.. ఇప్పుడు తన భార్య గుల్నర్ ఓ పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిందంటూ అఫీషియల్ గా అనౌన్స్ చేశాడు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News