ఫోటో స్టొరీ: అబ్బాయినా.. అంటున్న అదా!

Update: 2019-05-07 13:33 GMT
హీరోయిన్లు చాలామందే ఉంటారు.. వారిలో మెజారిటీ భామలు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటారు. కానీ నెటిజనులను తమ పోస్టులతో ఆకట్టుకోగలిగే వారు మాత్రం తక్కువే. అలాంటివారిలో అదా శర్మ ఒకరు.  రీసెంట్ గా అంటే మే 1 న మహారాష్ట్ర డే సందర్భంగా ఫుల్ జోష్ ఉండే ఒక మరాఠీ పాటకు డ్యాన్స్ చేసింది. అంది నెటిజనులను తో ఆకట్టుకుంది. తాజాగా ఒక న్యూడ్ ఫోటో షూట్ లాంటిది చేసి ఆ ఫోటోను ఇన్స్టా లో షేర్ చేసింది.

దానికి అదా "సో.. నేను మీ కలల్లో ఉండే అబ్బాయినా?  నా నెక్స్ట్ ఫిలిం 'మ్యాన్ టూ మ్యాన్'. నేను నా కెరీర్ ప్రారంభించినప్పుడు నేను ఒక మగవాడి పాత్ర పోషిస్తానని అసలేమాత్రం ఊహించలేదు. కానీ అలానే జరిగింది.  ఇంతవరకూ స్క్రీన్ పై చూడని రొమాంటిక్ కామెడీ.  ఒక ప్రత్యేకమైన లవ్ స్టొరీ...  మిగతాది మీ ఊహలకే నేను వదిలేస్తున్నాను" అంటూ  క్యాప్షన్ ఇచ్చింది. అర్థం అయింది కదా? అదా తన నెక్స్ట్ సినిమా 'మ్యాన్ టూ మ్యాన్' సినిమాలో ఒక పురుషుడి పాత్ర పోషిస్తోంది. ఈ సినిమాలో అదా ఒక హిజ్రా పాత్ర అని పొరపాటుగా అనుకున్నారు కానీ అదేం లేదు. ఈ సినిమాలో పుట్టుకతో అబ్బాయి అయిన అదా శర్మ పాత్ర లింగమార్పిడి ఆపరేషన్ ద్వారా అమ్మాయిగా మారుతుంది.   కానీ ఈ విషయం తెలియని హీరో నవీన్ కస్తూరియా ఆదాను పెళ్ళి చేసుకుంటాడు.   వివాహం తర్వాత ఈ లింగమార్పిడి కథ తెలుస్తుంది.  

కాన్సెప్ట్ తెలిసింది కదా. మరి ఈ కాన్సెప్ట్ కు తగ్గట్టుగా అదా ఒక స్టూలుపై న్యూడ్ గా ఉందనే అభిప్రాయం కలిగించేలా ఒక పోజులో కూర్చుంది. మూతిపై పెట్టుడుమీసాలు పెట్టుకుంది.  వైట్ కలర్ స్పోర్ట్స్ షూ ధరించింది కానీ ఒంటిపై నూలుపోగు లేకుండా ఇలా పోజివ్వడంతో నెటిజనులు అవాక్కయ్యారు. కొందరు మెచ్చుకున్నారు. ఒకరు "నువ్వేం చేయాలని అనుకుంటున్నావో అర్థం కావడం లేదు" అన్నారు. కానీ చాలామందికి ఈ పోజు నవ్వు తెప్పించడంతో స్మైలీ ఎమోజిలు పెట్టారు.


Tags:    

Similar News