• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  టబుకు పెళ్లి కాకపోవడానికి...

టబుకు పెళ్లి కాకపోవడానికి అతను కారణమా?

By - Tupaki Desk
Update: 2018-07-10 04:34 GMT
50వ పడికి దగ్గరగా ఉంది టబు. దాదాపు పాతికేళ్లుగా ఆమె సినిమాల్లో కొనసాగుతోంది. ఆమె తోటి హీరోయిన్లలో చాలామంది పెళ్లిళ్లు చేసుకుని వ్యక్తిగత జీవితంలో స్థిరపడ్డారు. యుక్త వయసుకు వచ్చిన పిల్లలు కూడా ఉన్నారు వాళ్లకు. కానీ టబు మాత్రం పెళ్లీ గిల్లీ ఏమీ చేసుకోకుండా ఒంటరిగానే ఉండిపోయింది. ఓ తెలుగు సీనియర్ హీరోతో బంధం వల్లే ఆమె పెళ్లికి దూరంగా ఉండిపోయిందన్న ఒక ప్రచారం ఎప్పట్నుంచో ఉంది. కానీ టబు మాత్రం తనకు పెళ్లికాకపోవడానికి కారణం అంటూ ఓ బాలీవుడ్ హీరోను చూపించింది. అలాగని ఆ హీరో గురించి మరో రకంగా మాట్లాడలేదు. చాలా పాజిటివ్‌ గానే స్పందించింది. ఆ హీరో మరెవరో కాదు.. అజయ్ దేవగన్.

తనకు అజయ్ తో పాతికేళ్లుగా స్నేహం ఉందని టబు చెప్పింది. తన జీవితం ఆరంభం నుంచి అజయ్ తనతో ఉన్నాడని టబు చెప్పింది. ఎందుకు ఏమిటి అని చెప్పలేదు కానీ.. అజయ్ వల్లే తాను పెళ్లి చేసుకోలేదని మాత్రం టబు స్పష్టం చేసింది. పెళ్లి చేసుకోనందుకు తనకు ఎలాంటి బాధా లేదని కూడా ఆమె పేర్కొంది. టబు.. అజయ్ తో కలిసి చాలా సినిమాల్లో నటించింది. వీళ్లిద్దరూ కలిసి చివరగా ‘దృశ్యం’లో నటించారు. మరి స్నేహితుడైన అజయ్.. టబు పెళ్లికి ఎలా అడ్డంకి అయ్యాడో.. ఇందులో లాజిక్ ఏంటో ఆమెకే తెలియాలి. పెళ్లి చేసుకుంటే బాగుంటుందా.. చేసుకోకుంటే బాగుంటుందా అన్నది తాను చెప్పలేనని.. పెళ్లి చేసుకుంటేనే అది బాగుందో లేదో తెలిసేదని.. తనకు ఆ అనుభవం లేదు కాబట్టి ఏది బెటరో చెప్పలేనంటూ వేదాంతం వల్లించింది టబు. ప్రస్తుతానికైతే తన జీవితం సంతోషంగా సాగిపోతున్నట్లుగా ఆమె చెప్పింది.
Tags:    
  • Actress Tabu 
  • Marriage 
  • Ajay Devgn 

Similar News

వారణాసి మహేష్ బాబు రాముడిగా ఎంత సేపు కనిపిస్తాడు...

2026-11-05 16:32 GMT

స్టెప్-మదర్ కాదు అంతకుమించి!

2026-11-05 16:30 GMT

అంగరంగ వైభవంగా సాయి దుర్గ తేజ్, కిరణ్ నిశ్చితార్థం.. అమ్మాయి వివరాలు ఇవే!

2026-11-05 16:16 GMT

రెడ్ అవుట్‌ఫిట్‌లో స్టన్నింగ్ లుక్‌తో మెరిసిన పాలక్!

2026-11-05 16:16 GMT

'రామాయణ' సెట్స్‌లో సీతగా సాయి పల్లవి.. BTS ఫొటోలు వైరల్!

2026-11-05 16:15 GMT

RC17: హీరో.. హీరోయిన్..విలన్.. ఎవరెవరంటే..!

2026-11-05 16:15 GMT

హై బడ్జెట్ ఫిల్మ్‌లో దళపతి విజయ్.. గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వంలో!

2026-11-05 16:12 GMT

అనిల్ రావిపూడి.. ఈసారి యాక్షన్ కూడా గట్టిగానే..

2026-11-05 16:12 GMT

ఒకప్పుడు ఏలిన టాప్-5 హీరోయిన్‌లు నేడు ఊహించ‌ని స్థితిలో!

2026-11-05 15:30 GMT

డస్టీ రోజ్ శారీలో షాలిని అందాల సందడి!

2026-11-05 14:30 GMT

కమల్ హాసన్ బ్యానర్‌లో రజనీకాంత్-శ్రీలీల!

2026-11-05 13:30 GMT

ఆ పాన్ ఇండియా విషయంలో మాత్రం తెలుగు వాళ్ళ కన్నా తమిళ వాళ్లే మిన్న..!

2026-11-05 12:30 GMT

Copyright @2026

Powered by Blink CMS