• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ఉదయ్ కిరణ్ ఆత్మహత్యపై...

ఉదయ్ కిరణ్ ఆత్మహత్యపై సంచలన వ్యాఖ్యలు

By - Tupaki Desk
Update: 2017-04-29 06:36 GMT
తెలుగు సినీ పరిశ్రమను గత కొన్నేళ్లలో అత్యంత బాధపెట్టిన అంశం.. ఉదయ్ కిరణ్ ఆత్మహత్య. అతను చనిపోయి ఏళ్లు గడుస్తున్నప్పటికీ.. ఇప్పుడా విషయం తలుచుకున్న మనసు చివుక్కుమంటుంది. ఒకప్పుడు వరుస విజయాలతో స్టార్ హీరోగా ఎదిగేలా కనిపించిన ఉదయ్ కిరణ్.. చివరికి ఇలాంటి స్థితికి చేరుకుంటాడని ఎవ్వరూ అనుకోలేదు. ఆత్మహత్య చేసుకోవాల్సినంత అవసరం అతడికి ఏమొచ్చిందన్నది ఎవ్వరికీ అంతుబట్టని విషయం. సినిమా అవకాశాలు తగ్గినంత మాత్రాన ఉదయ్ ప్రాణం తీసుకునేంతగా బాధపడ్డాడా అన్నది అందరి సందేహం. ఐతే సీనియర్ నటి సుధ చెబుతున్న దాని ప్రకారం ఉదయ్ కిరణ్ అంతకుముందు చాలా ఏళ్ల నుంచే డిప్రెషన్ తో బాధపడుతున్నాడట.

చిరంజీవి కూతురితో నిశ్చితార్థం రద్దయినప్పటి నుంచి ఉదయ్ కిరణ్ డిప్రెషన్లోకి వెళ్లిపోయాడని.. ఆ ప్రభావం నుంచి చాలా ఏళ్ల పాటు బయటపడలేకపోయాడని సుధ తాజాగా ఒక ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించింది. ఉదయ్ తో తనకు మంచి అనుబంధం ఉందని.. అతను తరచుగా తమ ఇంటికి వచ్చేవాడని.. తన బాధను పంచుకునేవాడని సుధ చెప్పింది. ఒక దశలో ఉదయ్ ను తాను కొడుకుగా దత్తత తీసుకోవాలని కూడా అనుకున్నట్లు ఆమె తెలిపింది. ఆ నిశ్చితార్థం రద్దు చాలా ఏళ్ల పాటు ఉదయ్ ను వెంటాడింది. ఉదయ్ ఆత్మహత్యాయత్నం నుంచి ప్రాణాలతో బయటపడి ఉంటే అతనా పని చేసినందుకు చెంప పగలగొట్టేదాన్నని సుధ ఆవేదనతో చెప్పింది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    
  • Actress Sudha 
  • Uday Kiran Suicide 
  • Telugu NEws 

Similar News

రజినీకాంత్ తో భారీ సక్సెస్ కొట్టలేకపోయిన ఈ తరం స్టార్ డైరెక్టర్లు...

2026-11-02 11:30 GMT

రామాయణంపై అనవసరమైన సెటైర్లు ఎందుకు?

2026-11-02 11:02 GMT

అందరినీ మెప్పించలంటే.. ఐస్‌క్రీమ్ అమ్ముకోవాలా..!

2026-11-02 10:00 GMT

వెండితెర నుంచి రగ్బీ మైదానం వరకు!

2026-11-02 10:00 GMT

కోలీవుడ్ చరిత్రలో సరికొత్త అధ్యాయం!

2026-11-02 09:52 GMT

బడా స్టార్లకు కొత్త కథలు కరువయ్యాయా? స్పై యాక్షన్‌పై పెరుగుతున్న అసంతృప్తి!

2026-11-02 09:50 GMT

ప్రత్యక్షంగా కనిపించకపోయినా..అభిమానుల మనసు గెలుచుకున్న బాద్‌షా!

2026-11-02 09:49 GMT

మెగా ఫ్యామిలీలో పెళ్లి సందడి.. సాయి ధరమ్ తేజ్ నిశ్చితార్థం, పెళ్లి ముహూర్తలు ఇవే..!

2026-11-02 09:49 GMT

సల్మాన్ ఖాన్ స్టైల్‌లో మలైకా అరోరా రియాక్షన్!

2026-11-02 09:48 GMT

హీరోయిన్ క్యారెక్టర్ విషయంలో లెక్కలు తప్పకూడదు మాస్టర్..!

2026-11-02 08:25 GMT

సెలవుల దెబ్బకు తగ్గిన కలెక్షన్లు..అయినా రేసులో త‌గ్గ‌ని చిత్రాలు!

2026-11-02 07:35 GMT

ఇక నిర్మాతలు ముందే అన్ని చూసుకోవాల్సిందే.. లాస్ట్ మినిట్ ప్లానింగ్‌కు చెక్..!

2026-11-02 07:34 GMT

Copyright @2026

Powered by Blink CMS