త్వరలో పెళ్లిపీటలెక్కనున్న శోభన!
తెలుగు సినిమాల్లో క్లాసికల్ డ్యాన్స్ పేరు చెప్పగానే గుర్తుకు వచ్చే నటి శోభన. తెలుగుతో పాటు తమిళ, కన్నడ, హిందీ, మలయాళ చిత్ర రంగాలకు ఆమె సుపరిచితులు. ఆమె వయస్సు దాదాపు 47 సంవత్సరాలు. ఇప్పటికీ ఆమె అవివాహితగానే ఉండడం ఓ మిస్టరీ. తన పెళ్లి గురించి స్పందించడానికి ఆమె ఇష్టపడేది కాదు. అయితే, ఆమె పెళ్లి చేసుకోబోతున్నదనే వార్త ఇప్పుడు మీడియాలో హల్‌చల్ చేస్తోంది.
శోభన ఇన్నాళ్లూ పెళ్లి చేసుకోకపోవడానికి ఆమె ప్రేమ విఫలం కావడమే ప్రధాన కారణం. అప్పట్లో ఓ మలయాళ నటుడితో ఆమెకు లవ్ ఎఫైర్ ఉందని వినికిడి. అయితే వ్యక్తిగత విభేదాల కారణంగా వారిద్దరూ విడిపోయారట. దీంతో, మనస్తాపానికి గురైన శోభన పెళ్లికి దూరంగా ఉన్నారట.
2001లో శోభన ఓ అమ్మాయిని దత్తత తీసుకొన్నారు. సినిమా పరిశ్రమకు దూరంగా ఉంటున్న శోభన ప్రస్తుతం చెన్నైలో కలర్పణ పేరు డాన్సింగ్ స్కూల్ నిర్వహిస్తోంది. ఆమె నటించిన మనిచిత్రతాజు (తెలుగులో చంద్రముఖి) చిత్రానికి జాతీయ అవార్డు లభించింది. ఫాజిల్ - ప్రియదర్శన్ - ఆదూర్ - మణిరత్నం దర్శకులతో కలిసి పనిచేసింది. సినీ, నృత్య రంగాలకు సేవలందిస్తున్నందుకు గాను శోభనకు పద్మశ్రీ అవార్డు దక్కింది.
కుటుంబ సభ్యులు, బంధు మిత్రులు శోభనను పెళ్లికి ఒప్పించడంలో సఫలమయ్యారట. దీంతో చిత్ర పరిశ్రమకు సంబంధం లేని వ్యక్తిని వివాహం చేసుకొనేందుకు ఆమె ఓకే చెప్పిందని సమాచారం. ఈ వార్తను శోభన గానీ, ఆమె కుటుంబ సభ్యులుగానీ అధికారికంగా ప్రకటించలేదు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/