పాకిస్థానీ సెంటిమెంట్ రష్మికకి కలిసి రాలేదు

Update: 2023-01-23 00:30 GMT
గత ఏడాది సీతారామం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన రష్మిక మందన్నా విమర్శకుల ప్రశంసలు దక్కించుకుంది. ఆ సినిమాలో రష్మిక పాకిస్థానీ అమ్మాయిగా కనిపించిన విషయం తెల్సిందే. సీత.. రామ్ ల యొక్క ప్రేమ కథను తెలుసుకునే పాకిస్తానీ అమ్మాయి పాత్ర లో  రష్మిక ఉన్నంతలో మెప్పించింది.

ఇండియా అంటే ఇష్టపడని పాత్రలో రష్మిక సీతారామం సినిమాలో కనిపించిన విషయం తెల్సిందే. ఆ సినిమా హిట్‌ అవ్వడంతో పాటు రష్మిక కి మంచి పేరు వచ్చింది. తాజాగా మిషన్ మజ్ను సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెల్సిందే. ఆ సినిమాలో కూడా రష్మిక మందన్నా పాకిస్తానీ యువతిగా కనిపించింది.

మిషన్ మజ్ను సినిమా లో రష్మిక అంధురాలిగా కనిపించింది. సీతారామం లో మాదిరిగా పాకిస్తానీ అమ్మాయి అవ్వడం వల్ల మిషన్‌ మజ్ను తో కూడా మంచి పేరు మరియు హిట్‌ వస్తుందని రష్మిక సెంటిమెంట్ ను నమ్ముకుంది. కానీ పాకిస్తానీ సెంటిమెంట్‌ మిషన్‌ మజ్ను సినిమా తో కలిసి రాలేదు.

ఇందిరా గాందీ హయాంలో జరిగిన ఇండో పాక్‌ యుద్దానికి ముందు జరిగిన సంఘటనల ఆధారంగా ఈ సినిమాను రూపొందించారు. శత్రు దేశం యొక్క అణు రహస్యాలను తెలుసుకునేందుకు గాను ఇండియన్‌ గూఢాచారి అయిన హీరో పాకిస్తాన్‌ లోకి చొరబడతాడు. ఆ తర్వాత జరిగే పరిణామాలు ఏంటీ అనేది సినిమా కథ.

పాకిస్తానీ అమ్మాయి నస్రీన్‌ గా రష్మిక మందన్నా కనిపించింది. కథ మరియు స్క్రీన్‌ ప్లే లో లోపాలు ఉండటంతో పాటు.. నస్రీన్‌ పాత్రకు సరైన ప్రాముఖ్యత లేదు. దాంతో మిషన్‌ మజ్ను సినిమా ఫలితం రష్మికను నిరాశ పర్చింది. ప్రస్తుతం ఈ అమ్మడి ఆశలన్నీ కూడా పుష్ప 2 పై ఉన్నాయి. మరి ఆ సినిమా ఈ అమ్మడిని మళ్లీ బిజీ చేసేనా చూడాలి.
Tags:    

Similar News