రక్షిత్ ను పెళ్లి చేసుకుని ఉంటే ఈ శ్రీవల్లి ఎక్కడ ఉండేది?
టాలీవుడ్ లోనే కాకుండా సౌత్ నుండి ఏ భాషలో అడిగినా కూడా స్టార్ హీరోయిన్ ఎవరు అంటే ఠక్కున వినిపించే పేర్లలో రష్మిక మందన్నా పేరు మొదటి వరుసలో ఉంటుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. దేశవ్యాప్తంగా రష్మిక మందన్నా కు ఇప్పడు మంచి క్రేజ్ దక్కింది. నేషనల్ క్రష్ గా గుర్తింపు దక్కించుకున్న రష్మిక మందన్నా బాలీవుడ్ లో ఎక్కువ కష్టపడకుండానే స్టార్ గా మారిపోయింది.
ఇప్పటికే అక్కడ రెండు హిందీ సినిమాల్లో నటిస్తున్న రష్మిక మందన్నా ఇటీవల పుష్ప సినిమా తో ఉత్తరాది ప్రేక్షకులకు మరింత గా చేరువ అయ్యింది. ఆ సినిమా లో శ్రీవల్లి పాత్ర తో ప్రతి ఒక్క ఇండియన్ సినీ అభిమానులకు చేరువ అయిన ఈ అమ్మడు ముందు ముందు మరిన్ని హిందీ సినిమాలు చేస్తుందని.. అంతే కాకుండా పాన్ ఇండియా సినిమాలు బ్యాక్ టు బ్యాక్ చేస్తుందని అంటున్నారు.
ఇటీవలే తమిళ సూపర్ స్టార్ విజయ్ హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రూపొందబోతున్న సినిమా లో హీరోయిన్ గా ఎంపిక అయ్యింది. ఇప్పటికే టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుతో నటించిన ఈమె ఇప్పుడు తమిళ సూపర్ స్టార్ తో నటించే అవకాశం దక్కించుకోవడం అరుదైన ఘనతగా చెప్పుకోవచ్చు. బాలీవుడ్.. టాలీవుడ్.. కోలీవుడ్.. పాన్ ఇండియా సినిమాలంటూ చేస్తున్న రష్మిక కన్నడ సినిమాల్లో కూడా నటిస్తూనే ఉంది.
రష్మిక మొదట కన్నడం లోనే హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. సొంత ప్రాంతం అయిన కర్ణాటకలో హీరోయిన్ గా కెరీర్ ను ఆరంభించి సక్సెస్ అయ్యింది. సినిమా నటుడు అయిన రక్షిత్ తో 20 ఏళ్ల వయసు లోనే రష్మిక మందన్నా కు వివాహ నిశ్చితార్థం అయ్యింది. పెద్దలు కుదిర్చన ఆ పెళ్లి సంబంధం నిశ్చితార్థం వరకు వచ్చి పెటాకులు అయ్యింది. అందుకు కారణం రష్మిక అంటూ కన్నడ సినీ అభిమానులు కొందరు ఇప్పటికి కూడా ఆరోపిస్తూ ఉంటారు.
రక్షిత్ తో నిశ్చితార్థం తర్వాత టాలీవుడ్ లో ఛలో మరియు గీత గోవిందం సినిమాలు రష్మికకు పడ్డాయి. దాంతో అనూహ్యంగా టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది. దాంతో ఆమె ను టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ గా పేర్కొనడం జరిగింది. ఆ కారణంగా పెళ్లి ని కాస్త ఆలస్యం చేయాలని... లేదంటే పెళ్లి తర్వాత కూడా నటిస్తానని రష్మిక విజ్ఞప్తి చేసిందట. కాని రక్షిత్ ఫ్యామిలీ ఒప్పుకోలేదు అనేది కొందరి మాట.
అసలు విషయం ఏంటో కాని రక్షిత్ మరియు రష్మిక ల పెళ్లి నిశ్చితార్థం వరకు వచ్చి ఆగిపోవడంతో ఇప్పుడు టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఆమె నిలిచింది. కేవలం టాలీవుడ్ లోనే కాకుండా దేశ వ్యాప్తంగా పాపులారిటీని దక్కించుకుంది. ఒక వేళ రక్షిత్ తో పెళ్లి అయ్యి ఉంటే కేవలం కన్నడ సినిమాలు చేసుకుంటూ ఉండేదేమో అని.. లేదంటే పూర్తిగా సినిమాలకు దూరం అయ్యి ఒకరు లేదా ఇద్దరు బిడ్దలకు తల్లిగా మారి గృహిణిగా అయ్యేదేమో అంటూ ఆమె అభిమానులు సోషల్ మీడియా ద్వారా చర్చించుకుంటున్నారు.