పాపం .. ఫ్లాప్ భారాన్ని మోయలేకపోతున్న రష్మిక!

Update: 2022-03-28 02:30 GMT
ఇండస్ట్రీలోని హీరోలైనా .. హీరోయిన్లైనా భయపడేది దేనికంటే  ..  ఫ్లాప్ కే. అది వారికంటికి తుఫాను కంటే .. సునామీకంటే  భయంకరమైనదిగా కనిపిస్తూ ఉంటుంది. అందువలన సాధ్యమైనంత వరకూ దాని బారిన పడకూడదని అనుకుంటారు. మనసులోనే వేడుకుంటారు. కానీ ఫ్లాప్ అనేది ఎవరినీ వదిలిపెట్టదు. ఏదో ఒక సమయంలో దొరకబుచ్చుకుని ఒక ఆట ఆడుకుంటుంది. హీరోలపై కంటే కూడా హీరోయిన్లపై  ఫ్లాప్ చూపించే ప్రభావం ఎక్కువ. అలాంటి ఫ్లాప్ బారిన పడినప్పుడు సాధ్యమైనంత త్వరగా దాని బారి నుంచి బయపడటానికే ట్రై చేస్తుంటారు.

పాపం  .. ప్రస్తుతం రష్మిక కూడా అదే పనిలో ఉంది. 'సరిలేరు నీకెవ్వరు' .. 'భీష్మ' .. 'పుష్ప' సినిమాలతో ఆమె హ్యాట్రిక్ హిట్ అందుకుంది. అల్లు అర్జున్ సరసన నాయికగా ఆమె చేసిన 'పుష్ప' పాన్ ఇండియా సినిమా. ఈ సినిమా సంచలన విజయాన్ని సాధించింది. వసూళ్ల విషయంలో కొత్త రికార్డులను సెట్ చేసింది. వివిధ భాషల్లో ఈ విజయం విహారం చేస్తుండటంతో రష్మిక ఆనంద తాండవమే చేసింది. ఇతర హీరోయిన్లకు అందనంత దూరం వచ్చేశానని అనుకుంది. అలాంటి ఒక ఉత్సాహంతో ఆమె ఉక్కిరిబిక్కిరవుతూ ఉండగా 'ఆడవాళ్లు మీకు జోహార్లు' విడుదలైంది.

 రష్మిక చాలా కాలం క్రితమే ఒప్పుకుని ఉండటం వలన ఈ సినిమా చేయవలసి వచ్చింది. అప్పటికే శర్వానంద్ - కిశోర్ తిరుమల ఫ్లాపులతో ఉన్నారు. అయినా పూర్తి నమ్మకంతో రష్మిక ఆ సినిమా చేసుకుంటూ వెళ్లిపోయింది. తీరా రిలీజ్ తరువాత చూసుకుంటే, రష్మిక జాబితాలో ఒక ఫ్లాప్ చేరిపోయింది. 'పుష్ప' సక్సెస్ ని పూర్తి స్థాయిలో ఎంజాయ్ చేయనీకుండా ఈ ఫ్లాప్ వచ్చి పడిందే అనుకుంటూ అందాల రష్మిక అదే పనిగా విలవిలలాడిపోతోంది. ఈ బాధకు విరుగుడు లేదా? అనుకుంటూ తనలో తానే కుమిలిపోతోంది.

నిజానికి రష్మిక కంటే ఓ రెండు అడుగులు ముందే ఉన్న పూజ హెగ్డే కూడా రీసెంట్ గా 'రాధే శ్యామ్' దెబ్బకి తట్టుకోలేక తబడుతోంది. అయితే కొద్ది రోజుల్లోనే రానున్న 'బీస్ట్' ఆమెకి ఒక ఆశాకిరణంలా కనిపిస్తోంది. ఇది కూడా పాన్ ఇండియా సినిమా కావడం వలన, ఇది హిట్ అయితే ముందుగా వచ్చిన ఫ్లాప్ ను జనం మరిచిపోతారు.

ఇక ఆ తరువాత 'ఆచార్య' కూడా ఎలాగో లైన్లోనే ఉంది. ఒకటికాకపోతే ఒకటి తనని ఆదుకుంటాయనే ఆశపడుతోంది. కానీ రష్మిక విషయంలో అలాంటి ఆశలు కనుచూపు మేరలో కనిపించడం లేదు. 'పుష్ప'తో ఆమెకి పడిన హిట్టు మళ్లీ దొరకాలంటే, 'పుష్ప 2'నే రావాలి. ఈ లోగా ఆమె చేతిలో కొత్త సినిమాలైతే లేవు. 'పుష్ప 2' ఇప్పుడప్పుడే వచ్చే అవకాశాలైతే లేవు. అందువలన అప్పటివరకూ రష్మిక ఈ ఫ్లాప్ భారాన్ని మోయవలసిందే!  
Tags:    

Similar News