ఫోటో స్టోరీ: ప్రగతి పచ్చబొట్టు.. స్లీవ్ లెస్ అబ్బో

Update: 2020-01-25 06:47 GMT
క్యారెక్టర్ ఆర్టిస్ట్ ప్రగతి తెలుసు కదా.. చాలా తెలుగు సినిమాల్లో తల్లి పాత్రలలో నటించింది. 'ఏమైంది ఈవేళ' సినిమాలో హీరో తల్లి పాత్రకు నంది అవార్డు కూడా అందుకుంది. వదిన..అక్క.. తల్లి పాత్రల్లో నటిస్తూ ఎలాంటి పాత్రలో నటించినా అద్భుతంగా అభినయించి ప్రేక్షకులను మెప్పించడం ఆమె ప్రత్యేకత. ప్రస్తుతం టాలీవుడ్ లో ఉన్న బిజీ క్యారెక్టర్ ఆర్టిస్టులలో ప్రగతి ఒకరు.

నిజానికి ప్రగతి తన కెరీర్ ఆరంభంలో పలు తమిళ చిత్రాలలో హీరోయిన్ గా నటించింది. అయితే వివాహం తర్వాత నటనకు మూడేళ్ళ పాటు గ్యాప్ ఇచ్చింది. తర్వాత సీరియల్స్ తో మొదలు పెట్టి టాలీవుడ్ లో బిజీ అయ్యేంతవరకూ తన పయనం సాగింది. తన వయసు ఉండే హీరోలకు అమ్మగా నటించి మెప్పించడం అంత సులువేమీ కాదు. అయితే ప్రగతి అలా చేయడమే కాకుండా మెప్పిస్తుంది. సినిమాల్లో ప్రగతి తల్లి పాత్రలు పోషించినప్పటికీ రియల్ లైఫ్ లో మాత్రం గ్లామరస్ గా కనిపిస్తూ నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తోంది. ఈమధ్య ప్రగతి ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ ఫోటోలో భుజంపైన పచ్చబొట్టు.. స్లీవ్ లెస్ బ్లౌజ్- చీర ధరించి సూపర్ హాట్ గా కనిపించింది. అద్దంలో వెనక భాగం కనిపించడం ఓ హైలైట్.

ఈ ఫోటోలను చూసిన నెటిజన్లు ప్రగతికి ఎంతసేపూ రోదనలకు వేదనలకు గురయ్యే తల్లి పాత్రలు ఇవ్వక పోతే మంచి గ్లామరస్ క్యారెక్టర్స్ కూడా ఇవ్వొచ్చుగా అని నిష్టూరమాడుతున్నారు. మన ఫిలిం మేకర్లు ఎప్పుడూ ఇంతే.. ఒకే మూసలో పడి ఫ్రీక్ అవుట్ ఫ్రీక్ అవుట్ అంటూ ఉంటారు!
Tags:    

Similar News