నాకు చెప్పింది వేరు స్క్రీన్ పై పాత్ర వేరు: నయన్

Update: 2019-05-09 03:57 GMT
ఎంత పెద్ద స్టార్ హీరో అయినా.. స్టార్ హీరోయిన్ అయినా అన్ని సినిమాలు హిట్స్ కావు.. అన్నీ ఫ్లాప్స్ కావు. అలానే వారి ఎంపిక ప్రతిసారి కరెక్ట్ అవుతుందనే గ్యారెంటీ కూడా లేదు. ఒక్కోసారి తమ కథల ఎంపిక పట్ల సినిమా రిలీజ్ అయిన తర్వాత చింతిస్తుంటారు.  అనవసరంగా ఆ సినిమా చేశామని అనుకుంటారు.  సౌత్ లో లేడీ సూపర్ స్టార్ గా పేరు తెచ్చుకున్న నయనతారకు కూడా  ఇలాంటివి తప్పలేదు.

రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన కెరీర్లో 'గజిని' చేయడం తన కెరీర్ లో ఒక చెత్త నిర్ణయం అని చెప్పింది. ఆ సినిమాలో అసిన్ మెయిన్ హీరోయిన్ అనే సంగతి తెలిసిందే.  నయన్ సెకండ్ హీరోయిన్ గా నటించింది.  ఆ సినిమాలో తను పోషించిన చిత్ర పాత్ర గురించి మాట్లాడుతూ "నాకు నెరేషన్ ఇచ్చిన చిత్ర పాత్రకు స్క్రీన్ పై కనిపించిన పాత్రకు చాలా డిఫరెన్స్ ఉంది" అంటూ ఆరోపించింది.

'చంద్రముఖి' లో చేసింది కూడా చిన్న పాత్ర అయినప్పటికీ తనకు మంచి పేరు తీసుకొచ్చిందని.. మొదట్లో ఆ పాత్ర స్వీకరించేందుకు తటపటాయించానని తెలిపింది. అదే సమయంలో విజయ్ సినిమా 'శివకాశి' లో కూడా ఒక సాంగ్ మాత్రమే చేసినప్పటికీ అది కూడా తనకుమంచి గుర్తింపు తీసుకొచ్చిందని తెలిపింది.  'గజినీ'  ఎక్స్ పీరియన్స్ తర్వాత తన పాత్రల ఎంపిక పట్ల జాగ్రత్త పడ్డానని తెలిపింది.  మరి మురుగా సారు నెరేషన్ ఒకటి ఇచ్చి.. పాత్రను స్క్రీన్ పై మరోలా ఉండేవిధంగా ఎందుకు చేశాడో ఏంటో?

    

Tags:    

Similar News