బోర్ డ‌మ్ కి టాటా చెప్పాలంటే ఒంట‌రి దీవికి ర‌మ్మంది

Update: 2022-05-01 16:30 GMT
వార‌మంతా అల‌సి సొల‌సిన దేహాల‌కు సండే వ‌స్తే రిలాక్స్ అయ్యేందుకు ఏదో ఒక ఎంట‌ర్ టైన్ మెంట్ కావాలి. కొంద‌రు సినిమాల‌కు వెళ్లేందుకు ప్రాధాన్య‌తనిస్తే.. మ‌రికొంద‌రు బీచ్ వెకేష‌న్స్ పేరుతో సుదూర ప్రాంత‌ల‌కు విహాయ‌రాత్ర‌ల‌కు వెలుతున్నారు. ఇంత‌కుముందు ప‌లువురు అందాల భామ‌లు మాల్దీవుల విహారంలో దుమారం రేపిన సంగ‌తి తెలిసిందే. అస‌లే స‌మ్మ‌ర్ .. ఆపై హీట్ ని త‌గ్గించాల్సిన సీజ‌న్ కావ‌డంతో ఇప్పుడు అంద‌రి చూపు ఒంట‌రి బీచ్ ల వైపే.

ఇప్పుడు ఆపిల్ బ్యూటీ హ‌న్సిక వంతు. ఈ బ్యూటీ ప్ర‌స్తుతం మాల్దీవుల విహారంలో స‌మ్మ‌ర్ తాపం నుంచి సేద దీరుతోంది. ఒంట‌రి దీవుల్లో ఎండ వేడి ఎక్కువ‌గానే ఉన్నా కానీ పూల్ సైడ్ ట్రీట్ తో ఒంటిని చ‌ల్ల‌బ‌రుస్తోంది హ‌న్సిక‌. కాక‌లు పుట్టించే వేడిని ఎలా దేహం నుంచి తొల‌గించాలో ఈ అమ్మ‌డికి తెలిసినంత‌గా ఇంకెవ‌రికీ తెలీదేమో! ఇదిగో ఇలా పూల్ సైడ్ ట్రీట్ ని కంటిన్యూ చేసింది. స్మైలీ ఫేస్ తో వెట్ హెయిర్ ఫ్లోర‌ల్ టూపీస్ లో హ‌న్సిక అంద‌చందాలు మైమ‌రిపిస్తున్నాయి. ప్ర‌స్తుతం ఈ ఫోటోగ్రాఫ్ అంత‌ర్జాలంలో వైర‌ల్ గా మారింది.

అన్న‌ట్టు హ‌న్సిక న‌టించిన సినిమాలేవీ ఇటీవ‌ల విడుద‌ల కాలేదు. ఇంత‌కుముందు ప‌లు ప్ర‌యోగాత్మ‌క చిత్రాల్లో న‌టిస్తూ బిజీగా ఉన్న ఈ బ్యూటీ వాటికి ప్ర‌మోష‌న్స్ కూడా చేయ‌డం లేదు. దీంతో అవ‌న్నీ తెర‌కెక్కుతున్నాయా లేదా? అన్న సందేహం క‌లుగుతోంది. క‌రోనా క్రైసిస్ ముందు కానీ అనంత‌రం కానీ అస‌లు హ‌న్సిక‌ను ప‌ట్టించుకున్న‌వాళ్లే లేరు అన్న కామెంట్లు వినిపిస్తున్నాయ్. వ‌రుస‌గా అర‌డ‌జ‌ను సినిమాల్లో హ‌న్సిక న‌టిస్తోంది. మ‌హా- 105 మినిట్స్- రౌడీ బేబీ- మై నేమ్ ఈజ్ శృతి- క‌న్న‌న్ మూవీ క్యూలో ఉన్నాయి. కానీ వీటికి సంబంధించిన స‌రైన అప్ డేట్ ఏదీ లేదు.
Tags:    

Similar News