బాలిరెడ్డి పాత్ర కోసం బీర్లు లాగించాడట!

Update: 2018-10-14 10:14 GMT
'అందాల రాక్షసి' తో ప్రేక్షకుల్లో గుర్తింపు తెచ్చుకున్న నటుడు నవీన్ చంద్ర. హీరో పాత్రలే చేస్తానని పట్టుబట్టకుండా ఆన్నీ పాత్రలు చేస్తూ తన కెరీర్ ను మలుచుకుంటున్నాడు.  తాజాగా రిలీజ్ అయిన ఎన్టీఆర్ చిత్రం 'అరవింద సమేత' లో విలన్ పాత్ర పోషించిన జగపతి బాబు కొడుకు పాత్ర బాలిరెడ్డి గా అందరినీ మెప్పించాడు.  ఎన్టీఆర్.. జగపతి పాత్రల తర్వాత నవీన్ పాత్రకే అందరి ప్రశంసలు లభిస్తున్నాయి.

ఈ సినిమా రిలీజ్ ఈవెంట్ లో నవీన్ చంద్రను గొప్ప నటుడని ఎన్టీఆర్ ప్రశంసించిన విషయం తెలిసిందే.  సినిమా రిలీజ్ అయిన తర్వాత అదే నిజమయింది.  మరి ఈ బాలిరెడ్డి పాత్రకోసం నవీన్ ఎలా ప్రిపేర్ అయ్యాడో చెప్పి నవీన్ అందరినీ సర్ ప్రైజ్ చేశాడు.  త్రివిక్రమ్ తనకు ఇచ్చిన పాత్ర రియలిస్టిక్ గా ఉండేందుకు బీర్ల సాయం తీసుకున్నాడట. మొహం మరీ పీక్కబోయినట్టు కాకుండా గుండ్రంగా ఉండేందుకు బీర్లు తాగి ప్రిపేర్ అవుతానని నవీన్ చెప్పాడట. త్రివిక్రమ్ "నీకు ఎలా బాగుంటుందనిపిస్తే అలా చేయమని" చెప్పాడట.  అంతే కాదు.. రాయలసీమకు వెళ్లి సీమ యాసను.. అక్కడున్న ప్రజల హావభావాలను కూడా గమనించాడట.

అలా ప్రిపేర్ అయ్యాడు కాబట్టే స్క్రీన్ మీద నవీన్ పాత్ర ఎంతో రియలిస్టిక్ గా కనిపించింది. 'అరవింద సమేత' సినిమా తో వచ్చిన గుర్తింపుతో నవీన్ కు ఇకపై మన తెలుగు డైరెక్టర్లు మంచి పాత్రలు ఆఫర్ చేస్తారనడం లో సందేహం లేదు.
Tags:    

Similar News