మహేశ్ మూవీలో ఛాన్స్ ఒక గిఫ్ట్ లాంటిది!

Update: 2022-05-15 05:30 GMT
తమిళంలో దర్శకుడిగా ..  రచయితగా .. నటుడిగా సముద్రఖనికి మంచి పేరు ఉంది.  పాత్ర ఏదైనా ఎంతో సహజంగా ఒదిగిపోవడం ఆయన ప్రత్యేకత. బేస్ వాయిస్  ... రఫ్ లుక్ ఆయన విలనిజాన్ని మరో స్థాయికి తీసుకుని వెళుతున్నాయి. ఈ మధ్య కాలంలో ఆయన తెలుగులో ప్రతినాయకుడిగా బాగా ఫేమస్ అయ్యాడు. 'క్రాక్' .. ' అల వైకుంఠపురములో' సినిమాలతో పాటు రీసెంట్ గా వచ్చిన 'సర్కారివారి పాట' సినిమాలోను ఆయన విలనిజానికి నూటికి నూరు మార్కులు  పడిపోయాయి. ఈ సినిమాలో రాజేంద్రనాథ్ గా ఆయన పోషించిన పాత్రకి ప్రశంసలు లభిస్తున్నాయి.

 తాజా ఇంటర్వ్యూలో సముద్రఖని మాట్లాడుతూ .. 'సర్కారివారి పాట' సినిమాలో విలన్ వేషం కోసం పరశురామ్ గారు  చాలా మంది ఆర్టిస్టుల పేర్లను పరిశీలించాడట. అప్పుడు మహేశ్ బాబుగారు నా పేరును సూచించడం వలన నాకు అవకాశం వచ్చింది. మహేశ్ బాబుగారు సూపర్ స్టార్. ఆయనకి ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది అభిమానులు ఉన్నారు. అలాంటి ఒక సూపర్ స్టార్ నోటి నుంచి నా పేరు రావడం నేను చేసుకున్న అదృష్టంగా భావిస్తున్నాను. మహేశ్ బాబు గారు చాలా గొప్ప ఆర్టిస్ట్. గతంలో నేను చేసిన 'మురారి' సినిమాను ఎన్ని సార్లు చూశానో నాకే తెలియదు.

మహేశ్ బాబు సినిమాలను నేను తప్పకుండా చూస్తుంటాను. 'మహర్షి' .. 'భరత్ అనే నేను'  సినిమాలను కూడా చాలాసార్లు చూశాను. ఆయన బాడీ లాంగ్వేజ్ .. డైలాగ్ డెలివరీ చాలా డిఫరెంట్ గా ఉంటాయి. ఈ సినిమా ఒప్పుకున్న తరువాత కూడా మహేశ్ బాబు సినిమాలను చూశాను. ఆయన తెరపై కనిపిస్తే ఆయనను మాత్రమే చూస్తుంటాను .. ఆ చుట్టుపక్కల ఏం జరుగుతుందనేది పట్టించుకోను. అలాంటి ఒక హీరో .. ఈ సినిమా కోసం నన్ను సిఫార్స్ చేయడం నిజంగా నాకు చాలా సంతోషాన్ని కలిగించే విషయం.

ఈ సినిమాలో మహేశ్ బాబుగారి స్థాయికి తగినట్టుగా ఆయనకి ఎదురుగా నిలబడి యాక్ట్ చేయడమనేది అంత తేలికైన విషయమేం కాదు. మహేశ్  బాబుగారి సినిమాలో ఛాన్స్ రావడమనేది ఒక గిఫ్ట్ లాంటిది. అలాంటి ఒక గిఫ్ట్ ను నాకు ఇచ్చిన మహేశ్ బాబుగారికీ ..  పరశురామ్ గారికి .. నిర్మాతలకు నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నేను ఇంతవరకూ చాలా సినిమాల్లో చేశాను. ప్రతి సినిమాకి సంబంధించి కెమెరా ముందుకు వెళ్లిన దగ్గర నుంచి, ఆ పాత్రను ఆడియన్స్ రిసీవ్ చేసుకునేవరకూ నేను టెన్షన్ పడుతూనే ఉంటాను. ఆర్టిస్ట్ కి ఆ  టెన్షన్ ఉండటం కరెక్ట్ అనుకుంటాను నేను" అని చెప్పుకొచ్చారు. 
Tags:    

Similar News