వ్యాక్సిన్‌ ఫస్ట్‌ డోస్ తీసుకున్న సూపర్‌ స్టార్‌

Update: 2021-03-11 12:30 GMT
కరోనా వ్యాక్సిన్ దేశ వ్యాప్తంగా 60 ఏళ్లు దాటిన వారికి ప్రభుత్వం ఇవ్వడం మొదలు పెట్టిన నేపథ్యంలో మొదటి రోజే ప్రధాని నరేంద్ర మోడీ సహా పలువురు ప్రముఖులు తీసుకున్న విషయం తెల్సిందే. పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు మంత్రులు వీఐపీలు కరోనా వ్యాక్సిన్‌ మొదటి డోస్ ను తీసుకున్నారు. తాజాగా మలయాళ సూపర్‌ స్టార్‌ మోహన్‌ లాల్‌ కూడా కరోనా వ్యాక్సిన్‌ మొదటి డోస్ ను కేరళలో తీసుకున్నారు. అమృత ఆసుపత్రిలో మోహన్ లాల్‌ కు వైధ్యుల పర్యవేక్షణలో వ్యాక్సిన్ మొదటి డోసును ఇచ్చినట్లుగా అధికారులు పేర్కొన్నారు.

గత ఏడాది కరోనా కారణంగా ఎంతో మంది సినీ ప్రముఖులు అనారోగ్యం పాలయ్యారు. కొందరు తిరిగి కోలుకున్నారు. మళ్లీ సినిమాలతో బిజీ అయిపోయారు. గత ఏడాది లాక్ డౌన్ సమయంలోనే మోహన్ లాల్‌ తన దృశ్యం 2 ను ముగించిన విషయం తెల్సిందే. కరోనా లాక్ డౌన్ కారణంగా థియేటర్లు మూత పడి ఉండటంతో దృశ్యం 2 ను ఓటీటీ ద్వారా విడుదల చేసేందుకు ఒప్పందం చేసుకున్నారు. ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చిన దృశ్యం 2 మంచి టాక్ ను దక్కించుకుంది. థియేటర్లలో విడుదల అయ్యి ఉంటే రికార్డు స్థాయి వసూళ్లు నమోదు అయ్యేవి అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు. దృశ్యం 2 ను తెలుగులో వెంకటేష్‌ రీమేక్‌ చేస్తున్న విషయం తెల్సిందే.
Tags:    

Similar News