బ్రేకింగ్ః డ్ర‌గ్స్ కేసులో న‌టుడు అరెస్టు.. ఇండ‌స్ట్రీలో సంచ‌ల‌నం!

Update: 2021-03-30 14:56 GMT
డ్ర‌గ్స్ కేసులో మ‌రో సంచ‌ల‌నం న‌మోదైంది. నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు ఓ న‌టుడిని అరెస్టు చేశారు. బాలీవుడ్ తోపాటు తెలుగులోనూ ప‌లు సినిమాల్లో న‌టించిన ఎజాజ్ ఖాన్ ను అదుపులోకి తీసుకున్నారు.బాలీవుడ్ న‌టుడు సుశాంత్ సింగ్ మ‌ర‌ణం త‌ర్వాత క‌దిలిన డ్ర‌గ్స్ డొంక‌.. ఇంకా కొలిక్కి రాలేదు. ప‌లు ఇండ‌స్ట్రీల‌ను చుట్టిన ఈ డ్ర‌గ్స్ కేసులో ఎంతో మందిన‌టులు జైలుకు వెళ్లొచ్చారు. తాజాగా.. బాలీవుడ్ న‌టుడు ఎజాజ్ ఖాన్ ను అరెస్టు చేశారు.

బాలీవుడ్ లో న‌టి రియా చ‌క్ర‌వ‌ర్తి, ఆమె సోద‌రు షోవిక్ చ‌క్ర‌వ‌ర్తి ఈ కేసులో అరెస్టై, బెయిల్ పై విడుద‌ల‌య్యారు. ఆ త‌ర్వాత ఎంతో మందిని అధికారులు విచారించారు. ఇందులో భాగంగానే ఎజాజ్ ఖాన్ ను అరెస్టు చేశారు. కాగా.. ఎజాజ్ ను అరెస్టు చేయ‌డం ఇది రెండోసారి. 2018లోనూ డ్ర‌గ్స్ కేసులో అరెస్టు చేసి, అత‌న్నుంచి డ్ర‌గ్స్ కూడా స్వాధీనం చేసుకున్నారు. తాజాగా మ‌రోసారి అదుపులోకి తీసుకోవ‌డం గ‌మ‌నార్హం.

రాజ‌స్థాన్ నుంచి ఎజాజ్ ఖాన్ వ‌స్తున్నాడ‌నే విష‌యం తెలుసుకున్న ఎన్సీబీ అధికారులు.. ముంబై ఎయిర్ పోర్టులోనే మాటువేసి, అరెస్టు చేశారు. కాగా.. ఇప్ప‌టికే డ్ర‌గ్స్ కేసులో సుమారు రెండువేల పేజీల చార్జ్ షీటును పోలీసులు స‌మ‌ర్పించారు. ఇప్పుడు ఎజాజ్ అరెస్టుతో మ‌రింత స‌మాచారాన్ని రాబ‌ట్టే ప‌నిలో ఉన్నారు పోలీసులు.
Tags:    

Similar News