• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  అఖిల్ బాబు.. ఇంకా ఎన్ని...

అఖిల్ బాబు.. ఇంకా ఎన్ని రోజులు ఈ బాడీ బిల్డప్?

By - Tupaki Desk
Update: 2023-01-02 17:12 GMT
అక్కినేని హీరోల దురదృష్టం ఏమిటో గాని ఒక సక్సెస్ అందుకున్న తర్వాత వెంటనే వారికి ఊహించని విధంగా మరో డిజాస్టర్ ఎదురవుతొంది. ముఖ్యంగా అతిపెద్ద సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని అనుకున్న ప్రతిసారి కూడా వారికి చేదు అనుభవాలు ఎదురవుతున్నాయి. అఖిల్ అయితే మొదటి నుంచి కూడా అదే తరహాలో ఇబ్బంది పడుతున్నాడు. ఇప్పటివరకు అతను చేసిన సినిమాలేవి కూడా మాస్ ఆడియెన్స్ ను ఆకట్టుకోలేదు.

ఇక ప్రస్తుతం అతను ఏజెంట్ సినిమాపై అయితే భారీ ఆశలు ఉన్నాయి. తప్పకుండా ఈ సినిమా బాక్సాఫీస్ సక్సెస్ అవుతుంది అని ఫ్యాన్స్ నమ్మకంతో ఉన్నారు. అఖిల్ కూడా తన ప్రాణం పెట్టి ఈ సినిమాలో నటించినట్లుగా తెలుస్తోంది. సురేందర్ రెడ్డి కాబట్టి యాక్షన్ ఎలిమెంట్స్  మాత్రం తక్కువగా ఉండవు అని చెప్పవచ్చు. అయితే ఈ సినిమాకు వచ్చిన సమస్య ఏమిటో ఇంతవరకు చిత్ర యూనిట్ పెద్దగా క్లారిటీ ఇచ్చింది లేదు.

గత ఏడాది డిసెంబర్ లో విడుదల కావాల్సింది. కానీ అనేక రకాల కారణాలతో వాయిదా పడుతూ వస్తోంది. కానీ ఎప్పటికప్పుడు ఫోటోషూట్స్ తో మాత్రం కొంత హైప్ క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు  ఇదివరకే చాలాసార్లు అఖిల్ ఏజెంట్ కు సంబంధించిన బాడీ ఫిట్నెస్ ఫొటోలతో ఎంతగానో ఆకట్టుకున్నాడు. అప్పట్లో ఒక టీజర్ విడుదల చేసి కూడా అదే తరహాలో అట్రాక్ట్ చేశారు.

ఇక రీసెంట్గా మరో బాడీ బిల్డప్ ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నాడు. అంతా బాగానే ఉంది కానీ ఇంకా ఇలా ఎన్ని రోజులు ఫోటోలతో ఫ్యాన్స్ ను సంతృప్తి పరుస్తారు అనేది అసలు ప్రశ్న. ఫ్యాన్స్ కు ఇవన్నీ వద్దు సినిమా అసలు అప్డేట్స్.. అలాగే ఎందుకు ఆలస్యం అవుతుంది? సినిమా సాంగ్స్ ఎక్కడ? అలాగే రిలీజ్ డేట్ ఎప్పుడు? ఇలాంటి ఎన్నో ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వాల్సిన అవసరం ఉంది.

సమ్మర్ లో ఫిక్స్ అంటున్నారు కానీ సరైన డేట్ దొరకడం కాస్త కష్టమే. ఇక సురేందర్ రెడ్డి అయితే ఈ సినిమాపై కూడా భారీ ఆశలు పెట్టుకున్నాడు ఆయన చివరగా చేసిన సైరా సినిమా అంతగా సక్సెస్ కాలేదు. అందుకే ఇప్పుడు అఖిల్ ఏజెంట్తో అతను సక్సెస్ అందుకోవాలని చూస్తున్నాడు. మరి ఏజెంట్ సినిమాను సమ్మర్ లో ఎప్పుడు విడుదల చేస్తారో చూడాలి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    
  • Actor 
  • AkhilAkkineni 
  • latestpic 
  • agent 
  • movie 
  • latestnews 

Similar News

సీనియ‌ర్ న‌టుడు పోగొట్టుకున్న‌ది స‌రే వార‌స‌త్వ‌ ఆస్తుల విలువ‌?

2026-11-09 19:30 GMT

'DNK' ట్రైలర్ టాక్: బెట్టింగులు.. దొంగతనాలతో మౌళి కామెడీ గోల

2026-11-09 19:16 GMT

'పొలిమేర 3' గ్లింప్స్: ​కొమరయ్య తాంత్రికం.. అర్జున్ సర్జా పవర్ఫుల్ ఎంట్రీ

2026-11-09 19:10 GMT

ఏంటిది? బేబి బంప్‌తో స‌మంత ప్ర‌యోగాలు!

2026-11-09 19:04 GMT

సెల‌బ్రేష‌న్‌లో మ‌హేష్-చ‌ర‌ణ్‌ తో ఆ ప్ర‌ముఖుడు ఎవ‌రు?

2026-11-09 19:03 GMT

పిక్‌టాక్‌ : మెగా ఫ్యాన్స్‌కి బెస్ట్‌ దీపావళి గిఫ్ట్‌

2026-11-09 19:02 GMT

పిక్‌టాక్‌ : స్టైలిష్ అందాల పలక్‌

2026-11-09 19:01 GMT

అలీ భార్య జుబేదా బేగం సోషల్ మీడియా సంపాదన ఎంతో తెలుసా?

2026-11-09 13:30 GMT

డమ్మీ థియేటర్లు.. బల్క్ బుకింగ్స్

2026-11-09 12:56 GMT

కారాల కళ్ళ పిల్లకు ఆది సైట్.. 'ఈగో రాజా' రౌడీ రాకసి

2026-11-09 12:51 GMT

21 ఏళ్ల‌కే వంద సినిమాల‌తో సంచ‌ల‌నం!

2026-11-09 12:30 GMT

ఆయనలో మా నాన్నను చూసుకుంటున్నాను.. తమన్ ఎమోషనల్ కామెంట్స్!

2026-11-09 11:30 GMT

Copyright @2026

Powered by Blink CMS