• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  మోనాల్‌ మనసులో ఉన్న 'A'...

మోనాల్‌ మనసులో ఉన్న 'A' నేనే

By - Tupaki Desk
Update: 2020-12-04 11:30 GMT
బిగ్‌ బాస్‌ ఈ సీజన్‌ లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన మోనాల్‌ ప్రతి రోజు ఎపిసోడ్‌ లో ఏదో ఒక సందర్బంగా లేదంటే ఎవరి చర్చ సందర్బంగానో ప్రస్థావనకు వస్తూనే ఉంది. మోనాల్‌ ను బిగ్‌ బాస్‌ కాపాడుతూ వస్తున్నాడు అంటూ విమర్శలు వస్తున్నాయి. అయినా కూడా ఆమె ను మాత్రం బిగ్‌ బాస్‌ వారం వారం సేవ్‌ చేస్తూ వస్తున్నాడు. మోనాల్‌ ఇప్పటి వరకు రావడంకు ఖచ్చితంగా కారణం ఆమె అఖిల్‌ మరియు అభిజిత్‌ ల మద్య ఇష్యూను రాజేయడం కారణం అనడంలో ఎలాంటి సందేహం లేదు. ప్రస్తుతం కూడా ఆమె వల్ల బిగ్‌ బాస్‌ కు ఫుటేజ్‌ వస్తుంది.

తాజాగా మరోసారి అభిజిత్‌ సుదీర్ఘంగా మోనాల్‌ విషయమై హారికతో మాట్లాడాడు. కన్ఫెషన్‌ రూంలో తనకు నాగార్జున క్లాస్‌ పీకడంపై హారిక అభిజిత్‌ తో చెప్పడం జరిగింది. దాంతో మోనాల్‌ విషయమై క్లారిటీగా హారికతో అభిజిత్‌ చెప్పడం జరిగింది. మోనాల్‌ తనను ఇష్టపడుతుంది. ఆమె మనసులో ఉన్న 'ఎ' నేనే. పలు సందర్బాల్లో నేను అంటే ఇష్టం అంటూ ఆమె స్వయంగా చెప్పింది. ఆమె మనసులో ఉన్న ఏ విషయమై ఆమె పలు సందర్బాల్లో చెప్పుకొచ్చింది. అది నేను ఎప్పుడు ఎవరి ముందు చెప్పలేదు. మొదటి సారి నేను నీకు మాత్రమే చెబుతున్నాను అన్నాడు.

మోనాల్‌ విషయంలో నేను కాస్త దూరంగా ఉండటం వల్లే ఆమె నన్ను నామినేట్‌ చేసిందని అభిజిత్‌ అన్నాడు. ఆ సమయంలో ఇంగ్లీష్‌ లో మాట్లాడుతుండగా హారిక తెలుగులో మాట్లాడు అంది. దాంతో అభిజిత్‌ కు కోపం వచ్చింది. సీరియస్‌ గా నేను మాట్లాడుతుంటే తెలుగులో మాట్లాడమంటావా అన్నాడు. నాలా మాట్లాడాలంటే నీకు ఇంకా అయిదు సంవత్సరాలు పడుతుంది అంటూ తన అటిట్యూడ్‌ ను చూపించే ప్రయత్నం చేశాడు. మొత్తానికి ఈ వీకెండ్‌ లో మళ్లీ నాగార్జునతో అభిజిత్‌ తిట్లు తిట్టించుకోవడం ఖాయంగా అనిపిస్తుంది.
Tags:    
  • Bigg Boss 4 
  • Monal Gajjar 
  • Abijeet 
  • Harika 

Similar News

విడుదలకు ముందే కేక పెట్టిస్తున్న కాకా..!

2026-11-05 08:06 GMT

నేచుర‌ల్ అందంతో జెన్ Zని క‌వ్విస్తున్న డెబ్యూ న‌టి

2026-11-05 08:06 GMT

అన్ని పుకార్ల‌కు చెక్.. 'దాదా' ఫిక్స‌యితే ద‌బిడి దిబిడే!

2026-11-05 07:53 GMT

ఇదేమి కన్ఫ్యూజన్ నాని.. అది ఇది కాదు.. అదే ఇది..!

2026-11-05 07:53 GMT

'రామాయణం' మూవీ రివ్యూ

2026-11-05 07:40 GMT

బాకీలు ఎగ్గొట్టిన మ్యూజిక్ డైరెక్టర్.. దేవుడికి కంప్లైంట్!

2026-11-05 07:36 GMT

మళ్లీ వోగ్ కవర్‌పై కత్రినా.. ఫ్యాన్స్‌కు స్పెషల్ ట్రీట్!

2026-11-05 07:35 GMT

ఈ దీపావళికి పెద్దగా సౌండ్ చేయలేకపోయిన టాలీవుడ్!

2026-11-05 07:27 GMT

కీర్తి సురేష్.. మరోసారి లెక్క తప్పిందా..

2026-11-05 07:23 GMT

సంక్రాంతి బాక్సాఫీస్ రేసు - 1000 కోట్ల బిజినెస్ అంచనా!

2026-11-05 07:21 GMT

తరుణ్ భాస్కర్.. నెక్స్ట్ ఆ హీరో దగ్గరికేనా!

2026-11-05 07:17 GMT

రహస్యం బయటపెట్టిన భాగ్యశ్రీ.. ఆ టాలెంట్ కూడా ఉందా?

2026-11-05 07:03 GMT

Copyright @2026

Powered by Blink CMS