అభిజిత్ కు బ్రేకప్‌ అయ్యిందా?

Update: 2020-12-23 12:55 GMT
తెలుగు బిగ్‌ బాస్‌ సీజన్‌ 4 విన్నర్‌ గా నిలిచిన అభిజిత్ వరుసగా ఇంటర్వ్యూల మీద ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు. టీవీ మీడియా.. వెబ్‌ మీడియాలు ఆయన ఇంటి ముందు క్యూ కట్టాయి. పలు ఇంటర్వ్యూలో ఆయన ఆసక్తికర విషయాలను వెళ్లడిస్తూ వచ్చాయి. ఇటీవల ఒక వెబ్‌ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రేమ.. పెళ్లి విషయమై స్పందించాడు. పెళ్లి విషయమై ఇప్పటికి ఇప్పుడు ఎలాంటి ఐడియా లేదని పేర్కొన్నాడు. ఎలాంటి అమ్మాయి కావాలనుకుంటున్నారంటూ ప్రశ్నించగా సింపుల్‌ గా కాస్త మెచ్యూర్డ్‌ గా ఉంటే చాలన్నాడు.

ఇంతకు ముందు లవ్‌ బ్రేకప్‌ ఏమైనా అంటూ యాంకర్‌ ప్రశ్నించిన సమయంలో అవన్ని ఇప్పుడు ఎందుకు లేండీ అంటూ సమాధానం దాటవేసే ప్రయత్నం చేశాడు. అతడి మాటలో ఏదో బ్రేకప్‌ ఉండే ఉన్నట్లుగా అనిపిస్తుంది. అంతటి చిల్‌ బాయ్ గ్లామర్ బాయ్ అయిన అభిజిత్ లైఫ్ లో ఈ ఏజ్ వరకు గర్ల్‌ ఫ్రెండ్‌ ఉండకుండా ఎలా ఉంటుంది. ఖచ్చితంగా ఉండే ఉంటుంది. కాని ఆమె తో అభికి బ్రేకప్‌ అయ్యి ఉంటుందని నెటిజన్స్‌ కామెంట్స్‌ చేస్తున్నారు. మొత్తానికి ఈ విషయం సోషల్‌ మీడియాలో హాట్‌ టాపిక్‌ అయ్యింది.
Tags:    

Similar News