• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  బిగ్ బీకి జూనియ‌ర్ బీ...

బిగ్ బీకి జూనియ‌ర్ బీ బ‌ర్త్ డే విషెస్‌!

By - Tupaki Desk
Update: 2017-10-12 12:24 GMT
అక్టోబ‌ర్ 11న బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బ‌చ్చ‌న్ 75వ పుట్టిన రోజు వేడుక‌లు జ‌రుపుకున్న సంగ‌తి తెలిసిందే. బిగ్ బీ పుట్టిన రోజు సంద‌ర్భంగా ట్విట్ట‌ర్లో అభిమానుల నుంచి అభినంద‌నలు వెల్లువెత్తాయి. గ‌త ఏడాదిలా కాకుండా ఈ సారి అమితాబ్ త‌న జ‌న్మ‌దిన వేడుక‌ల‌ను కుటుంబ‌స‌మేతంగా మాల్దీవుల‌లో జ‌రుపుకున్నారు. వీరంతా అక్క‌డి ఓ ల‌గ్జ‌రీ రిసార్ట్‌ లో బ‌స చేసిన‌ట్లు స‌మాచారం. అక్క‌డి  ప్రైవేట్  బీచ్ లో వారంద‌రూ పార్టీ చేసుకుని బాగా ఎంజాయ్ చేసిన‌ట్లు తెలుస్తోంది. అక్క‌డ అమితాబ్‌ బ‌చ్చ‌న్ కు అభిషేక్ బ‌చ్చ‌న్‌ - ఐశ్వ‌ర్య‌రాయ్ బ‌చ్చ‌న్‌ - శ్వేతా నంద‌లు స‌ర్ ప్రైజ్ ఇచ్చార‌ట‌. బ‌చ్చ‌న్ బ‌ర్త్ డే సెల‌బ్రేష‌న్స్ ఫొటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయ్యాయి.

ముందుగా అక్టోబ‌ర్ 10న అమితాబ్‌ - అభిషేక్‌ - ఐశ్వ‌ర్యా రాయ్ లు ముంబై నుంచి మాల్దీవుల‌కు వెళ్లారు. ఆ త‌ర్వాత శ్వేతా నంద‌ - ఆమె కూతురు నవ్య న‌వేలి అక్క‌డికి వెళ్లారు. బ‌ర్త్ డే సంద‌ర్భంగా ఒక‌ పెద్ద కేకును అమితాబ్‌ తో క‌ట్ చేయించి - బాణా సంచా కాల్చార‌ట‌. ఆ త‌ర్వాత అంతా క‌లిసి క్రూయిజ్ పార్టీ కూడా చేసుకున్నారు. వారంతా క‌లిసి....`హ్యాపీ బ‌ర్త్‌ డే` ఆంగ్ల అక్ష‌రాల‌ను బాణసంచాతో వెలిగించి బిగ్ బీకి విషెస్ చెప్పారు. ఆ మండుతున్న అక్ష‌రాల‌ను చూస్తున్న బిగ్ బీ ఫొటోను అభిషేక్ త‌న ఇన్‌ స్టాగ్రాం అకౌంట్లో పోస్ట్ చేశాడు. 75 వ‌సంతాలు గ‌డిచినా ఇంకా స్టైల్ గానే ఉన్నారు....హ్యాపీ బ‌ర్త్ డే పా....అంటూ క్యాప్ష‌న్ కూడా పెట్టాడు. ప్ర‌స్తుతం ఆ ఫొటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయ్యాయి. గ‌త ఏడాది అభిషేక్ బ‌చ్చ‌న్ పుట్టిన రోజును కూడా బ‌చ్చ‌న్ కుటుంబం మాల్దీవుల్లోనే సెల‌బ్రేట్ చేసుకుంది.
Tags:    
  • Abhishek Bachchan 
  • Amitabh Bachchan 
  • Telugu News 

Similar News

రణ్‌బీర్‌కి ఇలా, యష్‌కి అలా…రామాయణం మూవీ వెనుక ఇంట్రెస్టింగ్ సీక్రెట్స్..!

2026-11-20 10:20 GMT

బ‌న్నీ రేసులో బోయ‌పాటి నెంబ‌ర్ - 4!

2026-11-20 10:20 GMT

పండంటి మగ బిడ్డకి జన్మనిచ్చిన సమంత.. కొడుకు పేరు ఏమిటంటే?

2026-11-20 09:21 GMT

సౌత్ ఇండ‌స్ట్రీపై రాజ‌మండ్రి బ్యూటీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు!

2026-11-20 09:21 GMT

Allu Aravind Three Stars: చిరు, చరణ్, బన్నీ..!

2026-11-20 08:28 GMT

'ఓం' మూవీ రివ్యూ

2026-11-20 08:27 GMT

తెలిసిన వారినే ప్రశ్నించడానికి ఎందుకు వెనుకాడుతున్నాం?

2026-11-20 08:23 GMT

సూపర్‌స్టార్ పక్కన చిన్నపిల్లలా అందాల రాశీఖ‌న్నా!

2026-11-20 07:38 GMT

తొలుత అర్థం కాలేదు.. తెలిశాక వివరించే ప్రయత్నం చేశా!

2026-11-20 07:36 GMT

మృత్యువు అంచుల నుంచి కాజల్ అగర్వాల్‌కు తప్పిన ప్రమాదం..!

2026-11-20 06:45 GMT

'గాడ్జిల్లా'పై 'రామాయ‌ణం' ఇంపాక్ట్ ఎంత‌?

2026-11-20 06:43 GMT

సొంత థియేటర్‌పై ఫిర్యాదు.. అల్లు అరవింద్ రియాక్షన్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

2026-11-20 06:42 GMT

Copyright @2026

Powered by Blink CMS