విజయ్ దేవరకొండది ఓ చిన్న క్యారెక్టర్.. అతని గురించి నాకు ముందే తెలుసు

Update: 2020-12-24 06:53 GMT
లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్’ సినిమాతో స్మార్ట్ బాయ్ గా పేరు తెచ్చుకున్న అభిజిత్.. ఇప్పుడు బిగ్ బాస్-4 సీజన్ విజేతగా నిలవడంతో ఒక్కసారిగా లైమ్ లైట్ లోకి వచ్చాడు. ఈ సక్సెస్ తో అభిమానుల సంఖ్యను కూడా గట్టిగానే పెంచుకున్నాడు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కూడా అతని పేరు వైరల్ అవుతోంది. ఇక న్యూస్ ఛానెల్స్ కు వరుస ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు.

బిజీ బిజీగా..
రెండు రోజుల నుంచి కూడా అభిజిత్ చాలా బిజీగా కనిపిస్తున్నాడు. బిగ్ బాస్ షో నుంచి బయటకు వచ్చిన తర్వాత నుంచి గ్యాప్ లేకుండా వరుస ఇంటర్వ్యూలలో పాల్గొంటున్నాడు. ఇక హౌజ్ లో ఉన్నప్పుడు బయట నుంచి తనకు సపోర్ట్ అందించిన వారిని కూడా ప్రత్యేకంగా కలుసకొని ధన్యవాదాలు తెలుపేందుకు ప్రయత్నిస్తున్నాడు. ఇక, ఇటీవల ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో విజయ్ దేవరకొండతో తనకున్న రిలేషన్ గురించి కూడా క్లారిటీ ఇచ్చాడు అభిజిత్.

ఓ రెండు సినిమాలు పడితే..
ప్రస్తుతం ఉన్న క్రేజ్ కంటిన్యూ అయితే.. అభిజిత్ త్వరలోనే హీరోగా బిజీ అయ్యే అవకాశం ఉంది. ఇప్పటివరకు బిగ్ బాస్ ద్వారా విన్నర్ గా నిలిచిన కంటిస్టెంట్లు ఎవరు కూడా సినీ కెరీర్ లో పెద్దగా సక్సెస్ అయ్యింది లేదు. అయితే.. అభిజిత్ విషయంలో మాత్రం పరిస్థితి వేరేలా ఉంది. అతనికి దక్కిన రెస్పాన్స్ మామూలుగా లేదు. కరెక్ట్ గా రెండు సినిమాలు పడితే అతని స్థాయి మరో రేంజ్ కు వెళ్లే అవకాశం ఉంది.

చిన్న పాత్రలో విజయ్..
శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్ సినిమా ద్వారా అభిజిత్ హీరోగా పరిచయమైన విషయం తెలిసిందే. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ ఒక చిన్న పాత్ర చేసిన సంగతి కూడా అందరికీ తెలిసింది. కానీ.. ఇప్పుడు విజయ్ ఒక పాన్ ఇండియా సినిమా చేస్తున్నాడు. అలాంటి నటుడిపై మీ అభిప్రాయం ఏమిటని అడగగా.. అతని టాలెంట్ గురించి నాకు ముందే తెలుసు అంటున్నాడు అభిజిత్.

ముందే తెలుసు..
‘విజయ్ దేవరకొండ మై మ్యాన్.. నాకు దగ్గరగా ఉండే స్నేహితుడు. విజయ్ టాలెంట్ గొప్పది. అతని గురించి నాకు ముందే తెలుసు’ అంటున్నాడు అభిజిత్. ‘లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్ లో నటించిన అందరూ మంచి ప్రతిభావంతులే. శేఖర్ కమ్ముల గారు ఆడిషన్స్ మామూలుగా చేయరు. ఆయన ప్రతి ఒక్కరిని జాగ్రత్తగా టెస్ట్ చేస్తారు. ఆ సినిమాలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా అలాంటి వారే.. కానీ ఎవరికైనా ఒక మంచి అవకాశం అలాగే ఆ టైమ్ కూడా రావాలి’ అంటున్నాడు బిగ్ బాస్ విన్నర్.

నాకు విజయ్ మద్దతు..
‘నేను బిగ్ బాస్ లో ఉన్నప్పుడు కూడా విజయ్ నాకు మద్దతు ఇచ్చాడు. అందుకే ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అతనితో పాటు మిగతా లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్ నటీనటులు తనకు టచ్ లో ఉన్నారు. వారిలో సుధాకర్ కూడా ఉన్నాడు’ అని అభిజిత్ చెప్పాడు. తనకు సహకరించిన వారందరికీ ధన్యవాదాలు చెబుతున్నా అన్నాడు ఈ విజేత.
Tags:    

Similar News