బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ కొడుకు సినీ అరంగేట్రం!

Update: 2021-02-15 09:47 GMT
బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ కుమారుడు జునైద్ ఖాన్ 'మహారాజా' అనే సినిమాతో బాలీవుడ్‌ ఇండస్ట్రీలో హీరోగా అడుగుపెట్టబోతున్నాడు. ఈరోజు ముంబైలో స్టార్ కొడుకు తన ఫస్ట్ డే మూవీ షూటింగ్ కిక్-స్టార్ట్ చేసినట్లు సమాచారం. తాజా నివేదికల ప్రకారం.. జునైద్ గత ఐదు నెలలుగా తన లుక్స్ మరియు క్యారెక్టర్ పై పనిచేస్తున్నాడు. దర్శకుడు సిద్ధార్థ్ పి మల్హోత్రా, అతని ప్రొడక్షన్ బృందం గతనెల నుండి గ్రౌండ్ వర్క్ పూర్తిచేస్తున్నాయి. ఈ సినిమాకోసం ముంబైలోని విజయ్ నగర్ ప్రాంతంలో భారీ సెట్ నిర్మించబడింది. పీరియడిక్ డ్రామాగా తెరకెక్కనున్న ఈ సినిమాలో జునైద్ ఓ జర్నలిస్ట్ పాత్రలో కనిపించనున్నాడు. అయితే ఈ మహారాజా సినిమా 1862లో జరిగిన ఓ మహారాజ్ పరువు కేసు ఆధారంగా రూపొందించనున్నట్లు తెలుస్తుంది.

అప్పట్లో మత నాయకుడు జదునాథ్జీ బ్రిజ్రాతంజీ మహారాజ్ కు తన శిష్యులకు సంబంధించిన సబ్జెక్టు ఆధారంగా ఈ సినిమా నడుస్తుంది. మత అధిపతి తన మహిళా భక్తులతో లైంగిక సంబంధాలను బహిర్గతం చేసిన వార్తాపత్రికపై కేసు నమోదు చేస్తాడు. ఈ చిత్రంలో జర్నలిస్ట్ కర్సాండస్ ముల్జీ పాత్రలో జునైద్ ఖాన్ నటించనున్నాడు. మహారాజా జర్నలిస్ట్ కర్సాండస్ ముల్జీని కోర్టుకు ఎలా తీసుకెళ్లారో చూపనున్నారట. బాలీవుడ్ బడా ప్రొడక్షన్ హౌస్ యష్ రాజ్ ఫిలిమ్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకు సిద్ధార్థ్ పి మల్హోత్రా దర్శకత్వం వహిస్తుండగా.. జునైద్ తో పాటు అర్జున్ రెడ్డి ఫేమ్ షాలిని పాండే, షార్వారి వాగ్, జైదీప్ అహ్లవత్ ఇతర కీలకపాత్రలలో నటిస్తున్నారు. చూడాలి మరి మిస్టర్ పర్ఫెక్ట్ కొడుకు తన సత్తా చాటుతాడేమో!
Tags:    

Similar News