ప్రేమికుల రోజు గిఫ్ట్.. ప్రియుడిని ప‌రిచ‌యం చేసిన స్టార్ డాట‌ర్

Update: 2021-02-12 05:30 GMT
బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ కుమార్తె ఇరా ఖాన్ ప్రేమ‌లో ఉన్నార‌ని గ‌త కొంత‌కాలంగా సోష‌ల్ మీడియాల్లో ప్ర‌చారం అవుతోంది. అయితే దానిని ఇప్ప‌టివ‌ర‌కూ ఇరా అధికారికంగా ఖాయం చేయ‌లేదు. ఎట్ట‌కేల‌కు తన వాలెంటైన్స్ డే పోస్ట్ ‌తో తన ప్రేమ బంధాన్ని అధికారికంగా వెల్ల‌డించారు.

ఇరా ఖాన్ తన రిలేష‌న్ షిప్స్ గురించి ఎప్పుడూ ఓపెన్ ‌గా ఉంటారు. ఆమె మాజీ ప్రియుడు మిషాల్ కిర్పలానీ గురించి కానీ.. కొత్త ప్రియుడు నుపూర్ శిఖారేతో ప్రేమాయ‌ణాన్ని కానీ ఏనాడూ తాను ఎప్పుడూ దాచ‌లేదు. ఇపుడు వాలెంటైన్స్ డే సంద‌ర్భంగా తాజా ఇన్ స్టా పోస్ట్ ‌లలో నుపూర్ శిఖారేతో కలిసి కొన్ని సంతోషకరమైన క్ష‌ణాల్ని అంద‌మైన‌ శీర్షికలతో అభిమానుల‌కు షేర్ చేశారు. త‌న ల‌వ్ ని ఇరా అధికారికం గా అంగీక‌రించారు.

``ఇది మీకుతెలియ‌జేడం ఒక గౌరవం`` అయితే ఆమె తన పోస్ట్‌కు #వేల్ యు బి మైన్ # మై వాలెంటైన్# బడ్డీ #యు ఆర్ బెట‌ర్ చీజీ లైన్స్ #డ్రీమ్ ‌బాయ్.. అనే హ్యాష్ ట్యాగ్ ‌లను జోడించింది. ఇరా ఖాన్ ఇటీవల తన కజిన్ జయాన్ ఖాన్ వివాహానికి నూపూర్ శిఖారే తో క‌లిసి అటెండ‌య్యారు. అలాగే గత దీపావళి నుండి ఇరా ఖాన్ చిత్రాలలో నుపూర్ కనిపించారు. నూపూర్ శిఖారే అమీర్ ఖాన్ స‌హా ప‌లువురు బాలీవుడ్ ప్రముఖుల వ్యక్తిగత జిమ్ ట్రైన‌ర్ అన్న సంగ‌తి తెలిసిన‌దే. అత‌డి స‌మ‌క్షంలోనే ఇరా కూడా జిమ్ చేశారు. ఆ క్ర‌మంలోనే ఇరువురి న‌డుమ ప్రేమ ప‌ల్ల‌వించింది.
Tags:    

Similar News