షాక్ కి గురి చేస్తున్న టీవీ న‌టి యోగాస‌న ఫీట్

Update: 2021-01-04 08:30 GMT
మోడ‌ల్ కం టీవీ న‌టి ఆస్కా గొరాడియా యోగా ఫీట్స్ గురించి తెలిసిన‌దే. యోగా లైఫ్ .. నిరంత‌రం బీచ్ యోగా! అంటూ ఇటీవ‌ల గోవా బీచ్ నుంచి అదిరిపోయే యోగా విన్యాసాల‌తో ర‌చ్చ లేపుతున్న ఆస్కా గొరాడియా తాజాగా మ‌రో అదిరిపోయే ఫీట్ ని రివీల్ చేసింది.

ఇది యోగా గురువు స‌మ‌క్షంలో మాత్ర‌మే చేయాల్సిన అరుదైన విన్యాసం అన్న‌ది చెప్పాల్సిన ప‌నే లేదు. అలా భుజానికి తాకుతూ త‌ల మ‌ణిక‌ట్టు మీదుగా అంత ఎత్తుకి అరికాలి పాదాన్ని ఎత్త‌డం అంటే ఆషామాషీనా?  యోగాలో ఎంతో నిపుణులు అయితే కానీ చేయ‌లేని ఫీట్ ఇది. ఇలాంటివి ప్ర‌య‌త్నిస్తే తొడ భాగంలో పిక్క‌లు ప‌ట్టేస్తాయి. కాస్త జాగ్ర‌త్త‌గా ఉండాలన్న‌ది ఆస్కా వంటి నిపుణుల‌ సూచ‌న‌.

శిల్పా శెట్టి.. మ‌లైకా అరోరా.. త‌ర్వాత అంత నిష్ఠ‌గా తృష్ణ‌తో యోగా విన్యాసాలు చేస్తున్న తార‌గా ఇటీవ‌ల గోరాడియా పాపుల‌ర‌వుతున్నారు. టీవీ న‌టి ఓవైపు యోగా టీచింగ్ తో పాటు ర‌క‌ర‌కాల వ్యాపారాల్లోనూ బిజీగా ఉన్నారు. మ‌రోవైపు బాలీవుడ్ వెండితెర‌పైనా స‌త్తా చాటాల‌న్న పంతంతో ఉన్నార‌ట‌.
Tags:    

Similar News