AMJ పవన్ ను చూసి ఏమాత్రం వెనక్కి తగ్గని శర్వా!
ఒక పెద్ద హీరో సినిమా వస్తోంది అంటే దానికి తగ్గట్టే ఇతరులు త రిలీజ్ తేదీలను మార్చుకుంటారు. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ - రానా హీరోలుగా నటిస్తున్న మల్టీస్టారర్ భీమ్లా నాయక్ అత్యంత క్రేజీగా ఫిబ్రవరి 25న రిలీజవుతోంది.
అయితే అదే రోజు రిలీజవుతున్న శర్వానంద్ సినిమా ఆడవాళ్లు మీకు జోహార్లు వాయిదా పడుతుందని ఊహాగానాలు సాగాయి. సడెన్ గా భీమ్లా బరిలో దిగాడన్న వార్తతో అంతా ఇదే జరుగుతుందని ఊహించారు. కానీ ఊహించని స్టైల్లో ఎదురెళ్లడమే శర్వా విధానమని మరోసారి నిరూపిస్తున్నాడు.
ఇంతకుముందు మెగా బాస్ ఖైదీనంబర్ 150తో పోటీపడుతూ తన శతమానం భవతి చిత్రాన్ని బరిలో దించాడు. అప్పుడు హిట్ కొట్టాడు. ఇప్పుడు ఏకంగా పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన భీమ్లా నాయక్ తో పోటీకి దిగుతున్నాడు.
బరిలో పవన్ ఉన్నా వెనక్కి తగ్గేదేలే అంటూ దూసుకొస్తున్నాడు. అయితే బాక్సాఫీస్ వద్ద షేరింగ్ ఆరంభ వసూళ్లకు కొంత ఇబ్బందేననడంలో సందేహం లేదు. మంచి థియేటర్లు కూడా చాలా ముఖ్యం.
తాజాగా ఆడవాళ్లు మీకు జోహార్లు నిర్మాతలు అధికారికంగా రిలీజ్ తేదీని ప్రకటించేశారు. మా చిరు - ఆధ్య.. #ఆడవాళ్ళుమీకు జోహార్లు కోసం తమ డబ్బింగ్ పూర్తి చేసారు.యు ఫిబ్రవరి 25 నుండి మీకు థియేటర్లలో టన్నుల కొద్దీ చిరునవ్వులను అందించడానికి సిద్ధంగా ఉన్నారు`` అంటూ వెల్లడించారు.
చిరు పాత్రలో శర్వానంద్ నటిస్తుండగా.. ఆధ్యగా రష్మిక మందన్న కనిపించనుంది. సినిమాటోగ్రాఫర్ సుజిత్ సారంగ్, ..ఎడిటర్ శ్రీకర్ ప్రసాద్,.. కంపోజర్ దేవిశ్రీ ప్రసాద్ చిత్రబృందంలో ఉన్నారు.
ఆడవాళ్లు మీకు జోహార్లు చిత్రంలో ముఖ్య పాత్రలో నటి ఖుష్బు కూడా నటించారు. కిషోర్ తిరుమల దర్శకత్వం వహించారు. నిర్మాతలు నటీనటులు.. సిబ్బందితో పాటు మీడియా ప్రమోషన్స్ లో బిజీ అయ్యారు. ఈ సీజన్ లో ఆకట్టుకునే రొమాంటిక్ కామెడీ ఇది. ఈ చిత్రంలో శర్వానంద్- రష్మిక మందన్నలతో పాటు ఖుష్బు- రాధిక శరత్ కుమార్- ఊర్వశి కూడా ముఖ్య పాత్రల్లో నటించారు. ఈ చిత్రాన్ని ప్రధానంగా హైదరాబాద్ - రాజమండ్రిలో చిత్రీకరించారు.