సింపుల్ గా పోయేదానికి రచ్చ చేసుకున్న యువ హీరో!

Update: 2020-05-01 07:45 GMT
ఆయన ఓ యువ హీరో. అందరూ ఒక దారి అయితే ఈయన ఒక్కడిది మరో దారి. అందరూ చేసినట్టు చేస్తే గుంపులో గోవిందా అనుకుంటారనే భయంతో ఏదో కొత్తగా చేయాలని ప్రయత్నిస్తుంటాడు.  అయితే అన్ని సార్లు కొత్తదనం ఫలించదు. ఒక్కోసారి అది వికటిస్తుంది.  అది సినిమా అయినా.. నిజ జీవితం అయినా.  

కరోనా క్రైసిస్ వల్ల ఇబ్బంది పడుతున్న వారిని ఆదుకునేందుకు చాలామంది సెలబ్రిటీలు ముందుకొచ్చారు. అయితే అందరూ సాయం చేసినప్పుడు చేస్తే తన పత్యేకత ఏమీ ఉండదని భావించాడేమో కానీ అప్పుడు ఊరుకున్నాడు. అప్పుడు ఈ హీరో సాయం ప్రకటించలేదని సోషల్ మీడియాలో హంగామా జరిగింది. ఇప్పుడేమో జస్ట్ సాయం ప్రకటించి ఊరుకోకుండా అందులో కొంత మొత్తంతో ఏదో ఫండ్ అంటూ ఓ కొత్త కార్యక్రమం తలకెత్తుకున్నాడు. ఎంతో ఇన్ఫ్రా స్ట్రక్చర్.. పెద్ద సిస్టమ్ ఉన్న కేంద్ర.. రాష్ట్ర ప్రభుత్వాలే పథకాల అమలులో చాలాసార్లు బోల్తా పడుతుంటాయి. ఎలాంటి పథకమైన సరే ప్రకటించడం వేరు.. అమలుపరచడం వేరు.  ప్రాక్టికల్ గా ఎన్నో సమస్యలు ఉంటాయి. ఈ హీరోకు ఆ విషయం రెండు మూడు రోజులకే బోధపడింది. ఇది క్లిష్టమైన వ్యవహారం అని అర్థం అయింది

దీంతో ఆ హీరోపై సోషల్ మీడియాలో విమర్శలు వస్తున్నాయి.  తన దగ్గర పని చేసే ఉద్యోగస్తులకు జీతాలు ఇవ్వడం కష్టం అని పది రోజుల చెప్పుకున్న హీరో.. ఓ పెద్ద గోల్ తలకెత్తుకోవడం ఎందుకు? అభిమానుల నుంచి డబ్బు కలెక్ట్ చెయ్యడం ఎందుకు. ఇప్పుడు ఆన్ లైన్ లో అప్లై చేసుకున్న వాళ్లు ఎక్కువ అయ్యేసరికి.. "ఆపేయండి బాబోయ్" అని మళ్ళీ ఓ పోస్ట్  పెట్టడం ఎందుకు?  ఆ ట్రస్ట్ కు ఇచ్చిన పాతిక లక్షలు మిగతా ఎమౌంట్ తో పాటుగా విరాళంగా ఇచ్చి ఉంటే ఈ సమస్య ఉండేది కాదు కదా? ఇదంతా చేసి ఉన్న కాస్త బ్రాండ్ ఇమేజ్ కూడా పాడు చేసుకోవడం ఎందుకు? అంటూ నెటిజన్లు విమర్శిస్తున్నారు.


Tags:    

Similar News